Natyam Movie: పోనీ పోనీ ఈ ప్రాణమే.. నాట్యం మరో హార్ట్ టచింగ్ సాంగ్!

ప్రముఖ కూచిపూడి నర్తకి సంధ్య రాజు నాట్యం సినిమాతో ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు. ఒక ఎమోషనల్ డ్యాన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్ విషయంలో కూడా చా ట్రెడిషినల్ స్టైల్ లోనే అడుగులు వేస్తున్నారు. ఇటీవల తన బృందంతో కలిసి థియేటర్లలో సినిమా చూడటానికి ప్రేక్షకులను ఆహ్వానించడానికి నాట్యం స్టైల్ లోనే ఒక సాంగ్ చేశారు. ఇక ఇప్పుడు మరొక మంచి పాటను ప్రేక్షకుల ముందుకి తీసుకు వచ్చారు. పోనీ పోనీ ఈ ప్రాణమే.. అనే ఆ సాంగ్ ఎంతో ఎమోషనల్ గా ఆకట్టుకుంటోంది.

నాట్య కళాకారిని తన డ్రీమ్ కోసం ఎంతగా త్యాగం చేసింది అనే సందర్భాన్ని వివరిస్తూ కరుణాకర్ ఆడిగర్ల ఈ పాటను రచించగా శ్రవణ్ భరద్వాజ్ పాటను కంపోజ్ చేశారు. ఇక ఈ పాటను ఎంతో భావోద్వేగంతో లలితా కావ్య ఆలపించారు. ఇప్పటికే సినిమా టీజర్ ఫస్ట్ లుక్ తో పాటు ప్రమోషనల్ సాంగ్ కూడా ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది. తప్పకుండా సినిమా సక్సెస్ అవుతుందని నెటిజన్లు కూడా పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సాంగ్ కూడా అంచనాల డోస్ ను మరింత పెంచేసింది.

పాట వింటుంటే శాస్త్రీయ సంగీతంలోనే మనసులో భావోద్వేగాలతో కూడిన నాట్యం చేస్తున్నట్లుగా ఉందని కూడా అభినందనలు వెలువడుతున్నాయి. సంధ్య రాజు ఒక ప్రసిద్ధ శాస్త్రీయ డ్యాన్సర్ గా గుర్తింపు అందుకున్న విషయం తెలిసిందే. ఆమె వ్యాపారవేత్తగా కొరియోగ్రాఫర్, కాస్ట్యూమ్ డిజైనర్‌గా కూడా మంచి క్రేజ్ అందుకున్నారు. ఇక ఇప్పుడు కొత్త సినిమా నాట్యంతో ఆమె నిర్మాతగా మరియు నటిగా కూడా మారారు. రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 22న ప్రేక్షకుల ముందుకి రానుంది.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!


హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus