Ponniyin Selvan: భారీ ధరలకు డిజిటల్ రైట్స్ అంతం చేసుకున్న అమెజాన్!

ప్రముఖ రచయిత క‌ల్కి కృష్ణ‌మూర్తి రాసిన ‘పొన్నియ‌న్ సెల్వ‌న్’ న‌వ‌ల ఆధారంగా మ‌ణిర‌త్నం దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘పొన్నియ‌న్ సెల్వ‌న్’. ఈ సినిమాలో భారీ తారాగణం నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్,త్రిష వంటి స్టార్ సెలబ్రిటీలు ఈ సినిమాలో భాగస్వామ్యం అయ్యారు. ఇలా భారీ తారాగణంతో భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా సెప్టెంబర్ 30వ తేదీ రానుంది.

ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలాగే తాజాగా ఈ సినిమా హైదరాబాదులో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించుకున్నారు. ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ 30న విడుదల కావడంతో సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు రన్ టైం కూడా లాక్ చేశారు. ఇక ఈ సినిమా మొత్తం 2గంటల 47 నిమిషాలతో భారీ ట్రీట్ ఇచ్చారు.

ఈ సినిమాపై మేకర్స్ అధికార ప్రకటన తెలియజేశారు. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ గురించి కూడా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ భారీ ధరలకు కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ అన్ని భాషలలో కలిపి ఏకంగా 125 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ టీజర్ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus