Ponniyin Selvan1: పొన్నియన్ సెల్వన్ 11 రోజుల కలెక్షన్స్ ఇవే?

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో తన డ్రీమ్ ప్రాజెక్టుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పొన్నియన్ సెల్వన్. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ సెప్టెంబర్ 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా పలు భాషలలో విడుదలైన ఈ సినిమాకి కొన్నిచోట్ల మిశ్రమ స్పందన రాగా మరికొన్ని చోట్ల మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా 11 రోజులపాటు థియేటర్లో ప్రదర్శితమై భారీగానే కలెక్షన్లు రాబట్టిందని

ఈ సినిమా 400 కోట్ల క్లబ్లో చేరిందంటూ త్రెడ్ వర్గాల నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదలైన విషయం మనకు తెలిసిందే. తెలుగులో ఈ సినిమా 8.68 కోట్ల షేర్‌‌ను, 16.45 కోట్ల గ్రాస్‌ను అందుకుంది. అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్..10.50 కోట్లను అందుకోవాలంటే ఈ సినిమా మరో1.82 కోట్ల రూపాయలను రాబట్టాలి. ఇక ఈ సినిమా 11 రోజులపాటు ఏ ప్రాంతంలో ఎలాంటి కలెక్షన్లను రాబట్టింది అనే విషయానికి వస్తే..

తమిళనాడు 161.80 కోట్లు, తెలుగు రాష్ట్రాలు 16.45 కోట్లు, కర్నాటక 24.70 కోట్లు, కేరళ 21.60 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 26.95 కోట్లు, ఓవర్సీస్ 148.60 కోట్లు, టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 400.10 గ్రాస్ , 205.95 కోట్ల షేర్ వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 132 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగగా.. ఇప్పుడు 73 కోట్ల రేంజ్‌లో లాభాలను సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమా పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాని మణిరత్నం రెండు భాగాలుగా తెరకెక్కించారు. మొదటి భాగం సెప్టెంబర్ 30వ తేదీ విడుదల కాగా, రెండవ భాగం మరో ఆరు నెలలలో విడుదల కాబోతుందని ప్రకటించారు. మొత్తానికి మొదటి భాగం విడుదలైన 10 రోజులలోనే బ్రేక్ ఈవెంట్ సాధించి లాభాల బాటలో పయనిస్తోంది మరి పార్ట్ 2 ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus