Ponniyin Selvan OTT: రెంట్ పద్ధతిలో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘పొన్నియన్ సెల్వన్ -1’

లెజండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్’ మొదటి భాగం ‘పీఎస్-1’ పేరుతో సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. తెలుగులో ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచింది. ఇక తమిళంలో అయితే ఈ మూవీ ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది.

విడుదలై నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ డీసెంట్ రన్ ను కొనసాగిస్తుంది ఈ మూవీ. రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ‘పొన్నియన్ సెల్వన్’.. మొదటి భాగంతోనే చాలా వరకు రికవరీ చేసేసింది. విక్రమ్‌, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్‌, విక్రమ్‌ ప్రభు, శోభిత ధూళిపాళ, జయరామ్‌, ప్రభు, పార్తిబన్‌, ప్రకాష్‌రాజ్‌ వంటి అగ్ర నటీనటులు నటించిన ఈ మూవీ ఈ ఏడాది తమిళంలో ఆల్ టైం హిట్ గా నిలిచిన ‘విక్రమ్’ రికార్డులను సైతం బ్రేక్ చేసింది.

ఇప్పటివరకు ‘పీఎస్-1’ వరల్డ్ వైడ్ గా రూ.465 కోట్లకు పైనే గ్రాస్ వసూళ్లను రాబట్టింది. రూ.500 కోట్ల గ్రాస్ ను మార్క్ ను టచ్ చేస్తుందేమో అని అంతా ఆశగా ఎదురుచూస్తున్న టైములో ఈ చిత్రం ఓటీటీ రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతుండడం షాకిచ్చే అంశం. అవును అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘పొన్నియన్ సెల్వన్-1’ చిత్రం రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రాన్ని చూడాలి అంటే రూ.199 చెల్లించాలి. అప్పుడు కుటుంబం మొత్తం హ్యాపీగా చూసేయొచ్చు.

ఇక నవంబర్ 4 నుండి అయితే అన్ని వెర్షన్లలోనూ ఈ మూవీని ఫ్రీగా చూడొచ్చు. నిజానికి నవంబర్ 18 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవ్వాలి. కానీ అమెజాన్ ప్రైమ్ వారు క్రేజీ డీల్ కు రెడీ అవ్వడంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ‘లైకా ప్రొడక్షన్స్’, ‘మద్రాస్‌ టాకీస్‌’ బ్యానర్ల పై మణిరత్నం, సుభాస్కరన్ లు కలిసి ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని నిర్మించాయి. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించగా రవి వర్మ సినిమాటోగ్రఫీ అందించారు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus