ప్రేమ, డేటింగ్ వంటి వ్యవహారాలు ఇప్పుడు ఎక్కడ చూసినా కామన్ అయిపోయింది. సినీ పరిశ్రమలో అయితే వీటి గురించి అందరికీ తెలిసిందే. భవిష్యత్తులో రిలేషన్ ఎలా ఉండాలో… ఎంత కంఫర్ట్ గా ఉండాలో ముందుగానే ట్రయిల్ వేసి చేసుకుంటారిక్కడ. నిజానికి ఇది కొత్త విషయం కాదు. 1970 ల నుండీ జరుగుతున్నవే. ఒకప్పుడు మీడియా, సోషల్ మీడియా తాకిడి తక్కువ కాబట్టి.. ఇలాంటి విషయాలు బయటకు వచ్చేవి కావు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు.
చాలా వరకు ఈ విషయాల పై నటీనటులే ఓపెన్ అయిపోతున్నారు. తాజాగా ఓ నటి డేటింగ్, పడక సుఖాలు అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది. ఆమె మరెవరో కాదు పూజా బేడీ. ఒకప్పుడు తమ గ్లామర్ తో కుర్రకారుని ఓ ఊపేసిన భామల్లో ఈమె కూడా ఒకరు. ఈమె యవ్వన దశలో ఉన్నప్పుడు ఎదురైన కొన్ని అనుభవాల గురించి ఇటీవల కపిల్ శర్మ షోలో చెప్పుకొచ్చింది. అందరిలానే.. ‘బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేయాలని, పడక సుఖం చూడాలని నాకు ఉండేది.
కానీ నా తండ్రి, నటుడు కబీర్ బేడీ వ్యక్తిత్వం చూసి (Pooja Bedi) నాతో డేటింగ్ చేయడానికి ఎవ్వరూ ముందుకు వచ్చేవారు కాదు. కనీసం నాతో కాఫీ తాగేందుకు కూడా ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు కాదు. అంతేకాకుండా నా హైట్, పర్సనాలిటీ చూసి కాలేజీలో కూడా అబ్బాయిలెవరూ కూడా నా దగ్గరకు వచ్చేవారు కాదు.స్నేహితులు కూడా నాతో భయం భయంగానే గడిపేవారు’ అంటూ చెప్పుకొచ్చింది పూజా బేడీ.
బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!
అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు