‘ఆచార్య’ కోసం పూజాకి షాకింగ్‌ రెమ్యూనరేషన్‌

వెలుతురు ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని పెద్దలు చెప్పారు. ఈ మాటను మన హీరోయిన్లు చక్కగా అర్థం చేసుకుంటున్నారు. అందుకే ఫేమ్‌ ఉండగానే.. పైసలు వసూలు చేసుకుంటున్నారు. ఎంతగా అంటే 20 నిమిషాల పాత్రకు కోటి రూపాయలు తీసుకునేంత. అవును ‘ఆచార్య’ సినిమాలో పూజా హెగ్డే పాత్ర గురించే ఇదంతా. ఈ సినిమా పూజ కీలక పాత్రలో నటిస్తోందనే విషయం తెలిసిందే. రామ్‌ చరణ్‌కు జోడీగా కనిపించబోతోంది. ఈ పాత్ర కోసం పూజ షాకింగ్‌ రెమ్యూనరేషన్‌ డిమాండ్‌ చేసిందట. ఆమె క్రేజ్‌ దృష్ట్యా చిత్రబృందం ఆ డీల్‌కు ఓకే చెప్పిందట.

పూజా హెగ్డే హవా ప్రస్తుతం టాలీవుడ్‌లో నడుస్తోంది. వరుస సినిమాలు ఓకే చేసుకుంటూ వెళ్లిపోతోంది. అలా ‘ఆచార్య’లో రామ్‌ చరణ్‌ సరసన నటించబోతోంది. ఈ పాత్ర కోసం చాలామందిని అనుకున్నా.. ఆఖరుకు పూజను ఓకే చేసింది చిత్రబృందం. అయితే దీని కోసం ఆమె కోటి రూపాయలు వసూలు చేస్తోందట. సినిమాలో ఆమె పాత్ర నిడివి 20 నిమిషాలే ఉండబోతోంది. అంటే ఒక్కో నిమిషానికి ఆమెను ఐదు లక్షల రూపాయలు తీసుకుంటోందన్నమాట. భలే మంచి చౌక బేరం కదా.

‘స్టార్‌ హీరోయిన్ గా జోరు చూపిస్తున్న సమయంలో ఇలా తక్కువ నిడివి ఉన్న పాత్రలు ఎంచుకోవడం ఏంటో’ అని అందరూ అనుకుంటున్న సమయంలో కోటి రూపాయల మాట విని.. అదన్నమాట సంగతి అనుకుంటున్నారు. అన్నట్లు ఈ సినిమా టీజర్‌ చూసే ఉంటారు. రిలీజ్‌ డేట్‌ కూడా చెప్పేసింది చిత్రబృందం. ఆ లెక్కన మే 13న ‘ఆచార్య’ గుణపాఠాల సంగతి చూసేయొచ్చు.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus