Pooja Hegde: ఫస్ట్ టైం క్యాస్టింగ్ కౌచ్పై షాపింగ్ కామెంట్స్ చేసిన పూజ హెగ్డే!

పూజా హెగ్డే సినీ ఇండస్ట్రీలో నటిగా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం కాస్త తన స్పీడ్ తగ్గించారని తెలుస్తోంది. వివిధ భాష చిత్రాల ద్వారా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో బిజీగా ఉన్నటువంటి పూజా హెగ్డే ప్రస్తుతం అడపాదడపా సినిమా అవకాశాలను అందుకుంటున్నారు. అయితే ఈమె నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో ఈమెకు కాస్త అవకాశాలు తగ్గాయని తెలుస్తుంది.

ఇలా ప్రస్తుతం పెద్దగా సినిమా అవకాశాలు లేనటువంటి పూజ హెగ్డే తన వ్యక్తిగత జీవితంలో ఎంజాయ్ చేస్తూ గడుపుతున్నారు. ఇకపోతే తాజాగా ఈమె ఇండస్ట్రీలో ఉన్నటువంటి క్యాస్టింగ్ కౌచ్ పైమొదటిసారి స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఇండస్ట్రీలో ఎప్పటినుంచో క్యాస్టింగ్ కౌచ్ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఎంతోమంది సెలబ్రిటీలు ఈ విషయం గురించి మాట్లాడుతూ తాము కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితులమని తెలిపారు.

ఈ సందర్భంగా పూజ హెగ్డే కూడా క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఈమె కామెంట్ చేశారు. ఎంతోమంది అమ్మాయిలు ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా కొనసాగాలని తల్లిదండ్రులను కూడా ఎదిరించి ఇక్కడికి వస్తారు. అయితే ఇక్కడ మాత్రం అవకాశాలు పేరుతో కొందరి దుర్మార్గులు అమ్మాయిలను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారని అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతోమంది అమ్మాయిలు క్యాస్టింగ్ కౌచ్ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అలాంటి వారిలో తన స్నేహితులు కూడా ఉన్నారని ఈమె తెలియజేశారు. అయితే తన వరకు ఎప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందులు రాలేదని, ఇలాంటి ఇబ్బందులను తాను ఫేస్ చేయలేదు అంటూ ఈ సందర్భంగా పూజ హెగ్డే క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus