అప్పుడే పూజా .. రిస్క్ చేస్తుందా?

పూజా హెగ్దే ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. నాగ చైతన్య హీరోగా వచ్చిన ‘ ఒక లైలా కోసం’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బుట్ట బొమ్మ.. ఆ తరువాత ‘ముకుంద’ చిత్రంలోనూ నటించింది.ఆ వెంటనే బాలీవుడ్ ఆఫర్ రావడంతో అటువైపు చెక్కేసి చేతులు కాల్చుకుంది. అలాంటి పరిస్థితుల్లో దర్శకుడు హరీష్ శంకర్ ఆమెకు ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రంలో ఛాన్స్ ఇచ్చాడు. ఆ చిత్రం పెద్దగా ఆడకపోయినా… కొంచెమైనా ఆడింది అంటే అది హీరోయిన్ పూజా హెగ్దే వల్లే అనడంలో అతిశయోక్తి లేదు. ఆ చిత్రంలో ఆమె చేసిన గ్లామర్ షో అంతా ఇంతా కాదు. దాంతో వరుసగా ఈమెకు పెద్ద హీరోలతో సినిమాలు చేసే అవకాశం దక్కింది.

ఇప్పటికే ఎన్టీఆర్, మహేష్ బాబు.. వంటి బడా హీరోలతో నటించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో నటిస్తుంది . ప్రస్తుతం దర్శక నిర్మాతలకు ఫస్ట్ చాయిస్ పూజానే..! రెమ్యూనరేషన్ కూడా ఓ రేంజ్లో డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. ఇలాంటి టైములో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకి పూజా కమిట్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. అప్పుడే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయడం .. కంగారు పెట్టే అంశం ఏమీ కాదు. కానీ ఇప్పుడు వరుస ప్లాపుల్లో ఉన్న హనూ రాఘవపూడి వంటి డైరెక్టర్ తో చేయడమే కాస్త రిస్కేమో అనే డిస్కషన్లు జరుగుతున్నాయి. ఇటీవల పూజను కలిసి దర్శకుడు హను.. ఓ థ్రిల్లింగ్ లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టు చెప్పాడట. అది బాగా నచ్చేయడంతో పూజా ఓకే చెప్పేసినట్టు సమాచారం.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus