సాక్ష్యం టీమ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పూజ హెగ్డే!

ఒక లైలా కోసం సినిమాతో తెలుగులో అడుగు పెట్టిన పూజా హెగ్డే.. వెంటనే ముకుంద సినిమా చేసింది. రెండూ పూజ కెరీర్ ని పరుగులు పెట్టించలేకపోయాయి. అలాగే బాలీవుడ్ లోను హృతిక్ రోషన్ తో కలిసి అడుగుపెట్టినప్పటికీ విజయం అందుకోలేకపోయింది. ఆ తర్వాత అల్లు అర్జున్‌తో నటించిన దువ్వాడ జగన్నాథంతో  ఆమె కెరీర్ మలుపు తిరిగింది. వరుసగా ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ అందుకుంది. అలాంటి సమయంలోనే సాక్ష్యం సినిమా ఆఫర్ ముందుకు వచ్చింది. సాక్ష్యంలో సౌందర్య లహరి పాత్ర ఆఫర్‌కు మొదట పూజా మొదట నో చెప్పింది.

అయితే చాలా మంచి కథ, అందులో పాత్ర కూడా బాగుంటుంది అని సాక్ష్యం టీమ్ నచ్చచెప్పి ఆఫర్‌ను ఒప్పుకునేలా చేశారట. భారీ రెమ్యునరేషన్ అనే ఆశ కూడా చూపించారు. దీంతో సినిమా చేసింది. 40 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి మిశ్రమ స్పందన అందుకుంది. పెట్టిన బడ్జెట్ అందుకోవడానికి నానా తంటాలు పడుతోంది. అంతేకాదు హీరో కన్నా హీరోయిన్ నటనపైనే ఎక్కువ నెగటివ్ కామెంట్స్ రావడంతో సాక్ష్యం టీం తనను మోసం చేసిందని  పూజ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి ఇటువంటి కథ చేయకూడదని పూజా ఫిక్స్ అయినట్లు సమాచారం. అలాగే ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకూడదని నిశ్చయించుకుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus