Pooja Hegde : కారు ధర తెలిస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే..

టాలీవుడ్‍లో టాప్ హీరోయిన్‍గా ఉన్న పూజా హెగ్డే.. ప్రస్తుతం బాలీవుడ్‍పై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. షాహిద్ కపూర్‌తో త్వరలోనే ఓ సినిమా చేస్తున్నారు ఈ బుట్టబొమ్మ. ఇటీవల మాల్దీవుల ట్రిప్‍కు వెళ్లి పూజ.. గ్లామర్ ట్రీట్ చేస్తూ చాలా ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. పుట్టిన రోజును జరుపుకున్నారు. కాగా, తాజాగా పూజా హెగ్డే ఓ కొత్త కారును కొనుగోలు చేశారు. దసరా సందర్భంగా లగ్జరీ కారును సొంతం చేసుకున్నారు. రేంజ్ రోవర్‌కు చెందిన లగ్జరీ ఎస్‍యూవీని ఆమె కొత్తగా తీసుకున్నారు.

రేంజ్ రోవర్ ఎస్‍వీ ఎస్‍యూవీ కారును పూజా హెగ్డే కొనుగోలు చేశారు. ముంబైలో కొత్త కారు నుంచి ఆమె దిగుతుండగా.. కెమెరాల కంటికి చిక్కారు. దీంతో కారు ముందు ఆమె కెమెరాలకు పోజులు ఇచ్చారు. దసరా సందర్భంగా సంప్రదాయ దుస్తులను పూజ హెగ్డే ధరించారు. బ్లూ అనార్కలి డ్రెస్ ధరించి అందంగా మెరిశారు బుట్టబొమ్మ. పూజా హెగ్డే(Pooja Hegde) కొనుగోలు చేసిన ఈ రేంజ్ రోవర్ ఎస్‍వీ మోడల్ కారు ధర సుమారు రూ.4కోట్లుగా ఉందని తెలుస్తోంది. ఎస్‍వీ లైనప్‍లో టాప్ ఎండ్ మోడల్‍ను ఆమె తీసుకున్నారట. ఫుల్ ప్రీమియమ్ లగ్జరీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లను ఈ కారు కలిగి ఉంది.

6-సిలిండర్ ఇండేనియమ్ పెట్రోల్ ఇంజిన్, శక్తివంతమైన 294 kW మోటార్‌ను రేంజ్ రోవర్ ఎస్‍వీ కలిగి ఉంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 234 కిలోమీటర్లుగా ఉంటుంది. 35 స్పీకర్ల మెరిడియన్ సౌండ్ సిస్టమ్, 13.1 ఇంచుల ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‍మెంట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ ఇన్‍స్ట్రుమెంటల్ క్లస్టర్, హెడ్ అప్ డిస్‍ప్లే, మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్ లాంటి చాలా అధునాతన ఫీచర్లు, స్పెసిఫికేషన్లను ఈ కారు కలిగి ఉంది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus