నిర్మాతలకు షాక్ ఇచ్చిన హీరోయిన్ పూజా హెగ్డే..!

కరోనా వైరస్ మహమ్మారి వల్ల షూటింగ్ లు మొత్తం ఆగిపోయాయి.ఈ నాలుగు నెలల నుండీ సినిమా ఇండస్ట్రీకి కొన్ని వందల కోట్లు నష్టం వచ్చింది. ముఖ్యంగా నిర్మాతలు షూటింగ్ ల నిమిత్తం తెచ్చిన డబ్బులకు…. లక్షలకు లక్షలు వడ్డీలు కడుతున్నారట. ఇప్పుడు ప్రభుత్వం షూటింగ్ లకు పర్మిషన్ ఇచ్చింది. కానీ ఇప్పుడు తక్కువ మంది క్యాస్ట్ అండ్ క్రూతో పెద్ద సినిమాల షూటింగ్లు నిర్వహించడం అంత ఈజీ కాదు. అందులోనూ ఇది వరకటిలా సినిమా షూటింగ్ ల కోసం.. పక్క రాష్ట్రాలకు అలాగే విదేశాలకు వెళ్లడం కూడా చాలా కష్టం.

ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాతలు నటీ నటుల పారితోషికాల నుండీ కోతలు విధించాలని చూస్తున్నారు. కీర్తి సురేష్ వంటి స్టార్ హీరోయిన్ కూడా తన రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి ముందుకు వచ్చింది. అయితే స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే మాత్రం నిర్మాతలకు పెద్ద షాక్ ఇచ్చిందట. అవును.. ఇప్పుడు పూజా హెగ్డే తన పారితోషికాన్నిపెంచేసినట్టు సమాచారం. ‘అల వైకుంఠపురములో’ సినిమా వరకూ 1.5 కోట్లు తీసుకుంటూ వచ్చిన పూజా.. ఇప్పుడు తన తరువాతి సినిమాలకు 2 కోట్లు చెబుతుందట.

తన దగ్గరకు వచ్చే దర్శక నిర్మాతలకు ఈ విషయాన్ని ముందుగానే చెప్పేస్తుందట పూజా హెగ్డే. బాలీవుడ్ లో కూడా ఈమెకు మంచి డిమాండ్ ఏర్పడటం… అందులోనూ ‘అరవింద సమేత’ ‘మహర్షి’ ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్లతో పూజా హెగ్డే ఫామ్లో ఉండడంతో.. దర్శకనిర్మాతలు కూడా ఈమె పారితోషికం విషయంలో ప్రశ్నించలేకపోతున్నారని వినికిడి.

Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus