Pooja Hegde: లక్కీ హీరోయిన్‌ను మరోసారి తీసుకున్న దిల్‌ రాజు!

‘పూజా మన కాజా’ అంటూ ఈ మధ్య నిర్మాత దిల్‌ రాజు స్టేజీ మీద చెప్పారు. అంతలా దిల్‌ రాజు ప్రొడక్షన్‌ హౌస్‌కు పూజా హెగ్డే లక్కీ ఛార్మ్‌ అయ్యింది. అందుకే వరుస సినిమాల్లో ఆమెను హీరోయిన్‌గా ఎంపిక చేయాలని చూస్తున్నారు. విజయ్‌ – వంశీ పైడిపల్లి సినిమాలో పూజనే హీరోయిన్‌గా ఎంచుకోవాలని చూశారు. అయితే డేట్స్‌ కుదరక రష్మికను తీసుకున్నారు. అయితే ‘ఎఫ్‌ 3’ సినిమాలో ఆమెను ఎందుకు తీసుకోలేదు అనే డౌట్‌ రావొచ్చు.

ఆయనకు కూడా అలానే అనిపించిందేమో. ఆ సినిమాలోకి ఇప్పుడు తీసుకున్నారట. ‘ఎఫ్‌ 3’ సినిమాలో ఓ ఐటెమ్‌ సాంగ్‌ ఉందని చాలా రోజులుగా సమాచారం వినిపిస్తోంది. ఆ పాటకు అనసూయ డ్యాన్స్‌ వేసే అవకాశం ఉందని కూడా వార్తలొచ్చాయి. అయితే ఆ పాటకు ఇప్పుడు పూజా హెగ్డేను తీసుకుంటున్నారని వార్తలొస్తున్నాయి. అయితే ఈ పుకార్లు దిల్‌రాజు ఆమెను ‘కాజా’ అని ముద్దుగా పిలిచాకనే మొదలయ్యాయి. ఇదెప్పుడు అన్నారు అనుకుంటున్నారా… ‘బీస్ట్‌’ రిలీజ్‌ ప్రెస్‌ మీట్‌ సందర్భంగా అన్నారులెండి దిల్‌ రాజు.

కాబట్టి ‘ఎఫ్‌ 3’ సినిమాలో ఆమె ఉందా? లేదా అనేది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అయితే పుకార్లు మాత్రం గట్టిగానే వినిపిస్తున్నాయి. వచ్చే నెల తొలి వారంలో ఈ పాట‌ను హైద‌రాబాద్‌లోనే తెర‌కెక్కిస్తారట. దీని కోసం ఓ స్టూడియోలో భారీ సెట్‌ని తీర్చిదిద్దుతున్నారట. ‘రంగ‌స్థ‌లం’లో పూజా హెగ్డే చేసిన ‘జిగేల్ రాణి..’ పాట తరహాలోనే ఉంటుందని సమాచారం. అన్నట్లు ఈ పాట కోసం పూజ భారీ పారితోషికమే తీసుకుంటోందని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌.

ఇక ఈ సినిమా సంగతి చూస్తే మూడేళ్ల క్రితం వచ్చిన ‘ఎఫ్‌ 2’ సినిమాకు ఇది సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. వెంకటేశ్‌ సరసన తమన్నా… వరుణ్‌తేజ్‌ సరసన మెహరీన్‌ నటించారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వేసవి కానుకగా మే 27న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అన్నట్లు ఈ సినిమా కోసం ఓ ప్రమోషనల్‌ సాంగ్‌ను తెరకెక్కిస్తారని వార్తలొచ్చాయి. త్వరలోనే ఆ పాట షూటింగ్‌ కూడా ఉంటుందని భోగట్టా.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus