అప్పట్లో ఎన్టీఆర్, శోభన్ బాబు, ఏయన్నార్, కైకాల సత్యనారాయణ వంటి వారందరూ చెన్నైలో ఒకే రోడ్డులో ఉండేవారు. అందువల్ల వాళ్ళని చూడాలనుకున్నవాళ్లు ఆ గల్లీలోకి వెళ్ళి నిలబడితే ఎవరో ఒక స్టార్ హీరో లేదా యాక్టర్ దర్శనమిచ్చేవారు. అభిమానులు వారితో మాట్లాడి.. కుదిరితే ఒక ఆటోగ్రాఫ్ తీసుకొని బయటపడేవారు. కానీ.. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఒక స్టార్ హీరో లేదా హీరోయిన్ కనబడితే చాలు వాళ్ళని పలకరించడానికంటే ముందు ఫోన్ పైకెత్తి సెల్ఫీ కెమెరా ఆన్ చేస్తున్నారు జనాలు. ఆ సెల్ఫీల కోసం వాళ్ళు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు.
అయితే.. ప్రెజంట్ బిజీ హీరోయిన్ పూజా హెగ్డే మాత్రం ఒక డిఫరెంట్ ఫ్యాన్ ఎన్ కౌంటర్ ను ఫేస్ చేసింది. ఆమెను చూసి, ఆమెతో మాట్లాడడం కోసం ఒక తెలుగు అభిమాని 5 రోజుల పాటు ముంబైలో ఆమె అపార్ట్ మెంట్ ముందు రోడ్డుపై పడుకొని మరీ వెయిట్ చేశాడు. అది గమనించిన పూజా అతడ్ని కలిసింది, కాసేపు మాట్లాడింది.. ఆ వీడియోను ఇన్స్టాగ్రమ్ లో షేర్ చేసింది. తనతో మాట్లాడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి కానీ ఇలా రోడ్డు మీదకి రాకండి అని కోరుతూనే.. ఇలాంటి వీరాభిమానులు తనకు ఉన్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
View this post on Instagram
#PoojaHegde meets her ‘biggest fan’ who slept on footpath for 5 days only to meet the actress
A post shared by Filmy Focus (@filmyfocus) on
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!