SSMB28: మహేష్ 28 నుండీ తప్పుకున్న పూజా హెగ్డే… కారణం?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే వరుస ప్రాజెక్టులతో చాలా బిజీగా గడుపుతోంది.పెద్ద ప్రాజెక్టులు అన్నిటికీ పూజనే ఫస్ట్ ఛాయిస్ అన్నట్టు దర్శక నిర్మాతలు ఎగబడుతున్నారు. తెలుగులో మాత్రమే కాదు బాలీవుడ్‌లో సైతం పూజ వరుస ఆఫర్లు దక్కించుకుంటూ సాగుతుంది.పూజ కమిట్ అయిన సినిమాలకి డేట్స్ సర్దుబాటు చేయడంలో కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఓ స్టార్‌ హీరో సినిమా నుండీ పూజ తప్పుకున్నట్టు ఫిలింనగర్‌ టాక్.

పూజ వదులుకున్న ప్రాజెక్ట్ సూపర్‌స్టార్‌ మహేశ్‌- త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ లదే అని టాక్ . పరశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు మహేష్.ఈ ప్రాజెక్ట్ కోసం పూజ ని ఫైనల్ చేసినట్టు మేకర్స్ ప్రకటించారు.మహేష్ తో ఆల్రెడీ మహర్షిలో కలిసి నటించింది పూజ. అయితే ‘రాధేశ్యామ్’, ‘ఆచార్య’, ‘బీస్ట్‌’, ‘సర్కస్‌’ వంటి చిత్రాలతో పూజా హెగ్డే ఫుల్ బిజీగా ఉండడంతో.. #SSMB28 ప్రాజెక్ట్‌ నుండీ ఆమె తప్పుకున్నట్లు తెలుస్తుంది.

నిజానికి పూజ హెగ్డే ని మహేష్ సినిమాకి త్రివిక్రమ్ తీసుకోవడం మహేష్ అభిమానులకి అస్సలు నచ్చలేదు. ఈ విషయమై త్రివిక్రమ్ పై ట్రోలింగ్ కూడా జరిపారు మహేష్ అభిమానులు. పూజ తప్పుకోవడం వారికి హ్యాపీ న్యూసే అయ్యుండొచ్చు కానీ పూజ కాకుండా మహేష్ కోసం ఏ స్టార్ హీరోయిన్ ను ఎంపిక చేసుకుంటారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus