Pooja Hegde, Pawan Kalyan: ‘భవదీయుడు..’ నుండి పూజా హెగ్డే తప్పుకుందా!

పవన్‌ కల్యాణ్‌ సినిమా అవకాశమొస్తే నో చెప్పాలంటే అంత ఈజీనా. అంత డేర్‌ చేయడానికి ఎవరూ సిద్ధం కారు కూడా. అందులో స్టార్‌ హీరోయిన్లు, స్టార్‌లుగా వెలుగొందుందాం అనుకున్నవాళ్లు అయితే కచ్చితంగా ఆ పని చేయరు. కానీ పూజా హెగ్డే ఇప్పుడు ఆ పని చేస్తోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. దీనికి కారణం ఆ సినిమా ఆలస్యమవ్వడమే అని కూడా అంటున్నారు. ఇందులో నిజానిజాలు ఎంతో తెలియదు కానీ.. వార్త అయితే సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతోంది.

తెలుగు సినిమాల్లోకి వచ్చి ఐరెన్‌ లెగ్‌ అనిపించుకుని.. తర్వాత బాలీవుడ్‌కి వెళ్లిపోయింది పూజా హెగ్డే. ఆ తర్వాత తిరిగి టాలీవుడ్‌ వచ్చి లక్కీ లేడీ అనిపించుకుంది. ఈ క్రమంలో కుర్ర అగ్ర హీరోల సరసన నటించే ఛాన్స్‌ కొట్టేసింది. అయితే ఇటీవల కాలంలో ఈ అమ్మడి కెరీర్‌లో మళ్లీ జర్క్‌లు వస్తున్నాయి. ‘రాధేశ్యామ్‌’, ‘బీస్ట్‌’, ‘ఆచార్య’ అంటూ వరుస ఫ్లాప్‌లు వచ్చి దెబ్బ కొట్టాయి. కానీ ఆమె జోరు మాత్రం తగ్గడం లేదు. బాలీవుడ్‌ సినిమా ‘కబీ ఈద్‌ కబీ దివాళీ’లో నటిస్తోంది. మహేష్‌బాబు – త్రివిక్రమ్‌ సినిమాలోనూ నటిస్తోంది.

ఆ తర్వాత వరుసలో పవన్‌ కల్యాణ్‌ ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ సినిమా కూడా చేయాలి. అయితే పూరీ జగన్నాథ్‌ – విజయ్‌ దేవరకొండ ‘జేజీఎం’కి సైన్‌ చేయడంతో, ‘భవదీయుడు’ వదులుకుంది అని చెబుతున్నారు. మామూలుగా అయితే విజయ్‌ సినిమా కోసం పవన్‌ సినిమాను వదులుకునే ధైర్యం ఏ హీరోయినూ చేయదు. మరి ఇప్పుడు పూజా హెగ్డే ఇప్పుడు ఆ పని చేస్తుందా అనేది చూడాలి. ఆ విషయం పక్కనపెడితే ఎందుకు దూరం చేసుకుంటోంది అనేది కూడా ఆలోచించాల్సిన విషయం.

దీని వెనుక పవన్‌ కల్యాణ్‌ చేస్తున్న ఆలస్యమే కారణం అని చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ పాటికి ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ రిలీజ్‌ అవ్వాలి. లేదంటే షూటింగ్‌ అయినా జరుగుతుండాలి. కానీ పవన్‌ రాజకీయ కార్యక్రమాలు, వ్యక్తిగత పనుల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ‘వినోదాయ చిత్తాం’ షూటింగ్‌ త్వరలో ప్రారంభం అనే వార్తలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ ఆలస్యమవుతోంది. దీంతో పూజ సినిమాకు నో చెప్పేసింది అంటున్నారు. లేదంటే డేట్స్‌ అడ్జస్ట్‌ చేస్తుందో చూడాలి.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus