Pooja Hegde: హిట్ లేకపోయినా ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న పూజా హెగ్డే..

పూజా హెగ్డే తన సినిమాల ఫెయిల్యూర్‌ నుంచి ఓ పాఠాన్ని నేర్చుకుంది. ఏది పడితే అది చేయకూడదని అనుకుందట. కొత్త సినిమాల ఎంపికల తన పంథా మార్చిందని, కంటెంట్‌ ఉన్న సినిమాలకు ప్రయారిటీ ఇస్తుందని సమాచారం. తన పాత్రకి ఎంతటి ప్రయారిటీ ఉంటుందనేది చూస్తుందట. ఆ విషయంలో తగ్గేదెలే అంటోందని సమాచారం. ఈ కారణంగానే ఇప్పుడు రెండు పెద్ద సినిమాలు వదులుకుందని సమాచారం. పవన్‌ కళ్యాణ్‌, హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` అనే చిత్రం రూపొందుతుంది.

ఈ సినిమా ప్రారంభానికి ముందు నుంచి, రెండేళ్ల క్రితమే ఇందులో పూజా హీరోయిన్‌ అని దర్శకుడు హరీష్‌ శంకర్‌ ప్రకటించారు. మొన్నటి వరకు పూజానే హీరోయిన్‌ అనుకున్నారు. కానీ శ్రీలీల మరో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడంతో పూజా ఆశలు గల్లంతయ్యాయి. ఇందులో తన పాత్రకి పెద్దగా స్కోప్‌ లేదని పూజా ఈ సినిమా నుంచి తప్పుకుందని సమాచారం. తనకంటే శ్రీలీల పాత్రకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడంతో తాను `ఉస్తాద్‌ భగత్ సింగ్‌`ని లైట్‌ తీసుకుందని సమాచారం.

మరోవైపు మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న `గుంటూరు కారం` విషయంలోనూ అదే జరుగుతుందట. ఇందులోనూ శ్రీలీల సెకండ్‌ హీరోయిన్‌. చిత్ర వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. ఇందులో పూజా హెగ్డే కంటే శ్రీలీల పాత్ర నడివే ఎక్కువగా ఉంటుందని, ఇంపార్టెన్స్ కూడా ఎక్కువగానే ఉంటుందని అంటున్నారు. ఈ విషయంలోనే పూజా కొంత డిజప్పాయింట్‌గా ఉందట. త్రివిక్రమ్‌ కావడంతో కాదనలేకుండా చేస్తుందని సమాచారం. ఇంకోవైపు విజయ్‌ దేవరకొండ-పరశురామ్‌ కాంబినేషన్‌లో సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే.

ఇందులో మొదట (Pooja Hegde) పూజా హెగ్డే హీరోయిన్‌ అని, `జనగణమన`లో విజయ్‌తో కలిసి నటించాల్సి ఉండగా, అది క్యాన్సిల్‌ కావడంతో ఇందులో పూజాని ఆఫర్‌ చేశాడట విజయ్‌. కానీ పాత్రకి ప్రయారిటీ లేదట. నిడివి కూడా పెద్దగా లేదని, అందుకే ఈ ప్రాజెక్ట్ కి ఆమె నో చెప్పిందని టాలీవుడ్‌ టాక్‌. దీంతో ఆమె స్థానంలో మృణాల్‌ ఠాకూర్‌ని ఎంపిక చేశారు. మూడు రోజుల క్రితం ఈ సినిమా గ్రాండ్‌గా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం పూజా చేతిలో కేవలం `గుంటూరు కారం` ఒక్కటే ఉంది. కొత్త ప్రాజెక్ట్ లకు చర్చలు జరుగుతున్నాయట.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus