పూజా హెగ్డే (Pooja Hegde) గతంలో టాలీవుడ్‌ను ఏలిన స్టార్ హీరోయిన్‌గా నిలిచినప్పటికీ, ప్రస్తుతం ఆమెకు పోటీ పెరిగిందని చెప్పాలి. మొదట నాగచైతన్యతో (Naga Chaitanya) “ఒక లైలా కోసం” (Oka Laila Kosam) చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన పూజ, “ముకుంద” (Mukunda) ద్వారా గుర్తింపు పొందింది. అయితే బాలీవుడ్‌లోని హృతిక్ రోషన్‌తో (Hrithik Roshan) చేసిన సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో, ఆమెకు అవకాశాలు తగ్గాయి. టాలీవుడ్‌లో “దువ్వాడ జగన్నాథం” (Duvvada Jagannadham) సినిమాతో బిగ్ కమ్‌బ్యాక్ ఇచ్చి, వరుసగా “మహర్షి,” (Maharshi) ‘అరవింద సమేత’ (Aravinda Sametha Veera Raghava) ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramulo) వంటి హిట్స్ అందుకొని, స్టార్ హీరోయిన్‌గా మారింది.
కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఆమె క్రేజ్ తగ్గింది. గతంలో పూజ హెగ్డేకి పలు పెద్ద సినిమాల్లో ఛాన్స్ లభించినా, కొన్ని ప్రాజెక్టులను వదులుకోవడం ఆమె కెరీర్‌పై ప్రభావం చూపింది. “గుంటూరు కారం” (Guntur Kaaram), “ఉస్తాద్ భగత్ సింగ్” (Ustaad Bhagat Singh) చిత్రాల నుంచి ఆమె తప్పుకోవడం, శ్రీలీలకు (Sreeleela) ఆ అవకాశాలు దక్కడం పూజ అభిమానులను నిరాశపరిచింది. ప్రస్తుతం పూజ తమిళంలో విజయ్‌తో (Vijay Thalapathy) సూర్యతో (Suriya) రెండు పెద్ద సినిమాలు చేస్తుండగా, బాలీవుడ్‌లో కూడా రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. కానీ తెలుగులో మాత్రం ఆమె చేతిలో ఏ పెద్ద ప్రాజెక్ట్ లేదన్నది నిజమే.
ఈలోగా శ్రీలీల, రష్మిక మందన్న (Rashmika Mandanna) , సాయి పల్లవి (Sai Pallavi) వంటి హీరోయిన్స్ మంచి ఫామ్‌లో ఉండటం పూజకు గట్టి పోటీగా మారింది. శ్రీలీల వరుస ఫ్లాపుల అనంతరం కూడా క్రేజ్‌ను కాపాడుకుంటూ, పెద్ద హీరోలతో సినిమాలు చేస్తోంది. రష్మిక పాన్ ఇండియా స్థాయిలో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటే, సాయి పల్లవి తన డీగ్లామర్ రోల్స్‌తో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ ముగ్గురు హీరోయిన్స్ స్టార్ హీరోల ప్రాజెక్ట్స్‌లో దూసుకుపోతుండడంతో, పూజకు తెలుగులో అవకాశాలు తగ్గుతున్నాయి.
పాన్ ఇండియా సినిమా ప్రాజెక్టుల్లో అవకాశాలు లభిస్తే, పూజ తన స్థాయిని తిరిగి తెచ్చుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆమె ఉన్న ప్రాజెక్టుల ద్వారా సక్సెస్ అందుకొని, తిరిగి టాలీవుడ్‌లో స్థిరపడేందుకు కృషి చేయాలని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు. మరి పూజ తన మునుపటి స్థాయిని తిరిగి పొందుతుందా లేదా అనేది ఆమె అప్‌కమింగ్ సినిమాలపై ఆధారపడి ఉంది.