Pooja Hegde, Ravi Teja: పూజ… ఈ సినిమా ఒప్పుకుంటే మూడు ప్రశ్నలకు ఆన్సర్లు వచ్చేస్తాయ్‌!

‘గుంటూరు కారం’ – పూజా హెగ్డే… గత కొన్ని రోజులుగా ఈ రెండు అంశాల కాంబినేషన్‌లో టాలీవుడ్‌లో చర్చ నడుస్తూనే ఉంది. కారణం ఆ సినిమాలో పూజా హెగ్డే కాకపోవడమే. ఆమెనే తప్పుకుందా? లేక తప్పుకోవాల్సి వచ్చిందా? తప్పించారా? తప్పించాల్సి వచ్చిందా? అంటూ రకరకాల చర్చలు జరుగుతున్నాయి. దీనికి ఒక్కో వర్గం వాళ్లు ఒక్కో సమాధానం చెబుతున్నారు. వేరే ప్రాజెక్ట్‌ల వల్ల పూజా ఈ సినిమా నుండి తప్పుకుంది అనే చర్చ కూడా ఉంది. అయితే దీనిపై క్లారిటీ వచ్చే సమయం వచ్చింది.

పూజా హెగ్డేకు (Pooja Hegde) ప్రస్తుతం టాలీవుడ్‌లో సినిమాలు లేవు. ఇటీవల కాలంలో ఆమె తెలుగు సినిమాలేవీ సైన్‌ చేయలేదు. రీజన్స్‌ తెలియదు. మరోవైపు ఓకే చేసిన ‘ఉస్తాద్‌ భగత్ సింగ్‌’, ‘గుంటూరు కారం’ సినిమాలను వదులుకుంది. కారణాలు తెలియరాలేదు. దీంతో టాలీవుడ్‌ నుండి ఆమె ఏమైనా వెళ్లిపోతోందా అనే ప్రశ్నలు కూడా ఉదయించాయి. ఈ మొత్తం ప్రశ్నలకు సమాధానం ఒక్క సైన్‌తో తెలియబోతోంది అని అంటున్నారు.‘టైగర్‌ నాగేశ్వరరావు’, ‘ఈగల్‌’ సినిమాలతో బిజీగా ఉన్న రవితేజ త్వరలో గోపీచంద్‌ మలినేనితో ఓ సినిమా చేయబోతున్నాడు.

ఇవి కాకుండా మరో సినిమాకు సైన్‌ చేసే పనిలో ఉన్నాడట రవితేజ. ప్రముఖ దర్శకుడు తెరకెక్కించనున్న ఆ సినిమా కోసం హీరోయిన్‌గా పూజా హెగ్డేను అనుకుంటున్నారట. ఈ మేరకు ఆమెను సంప్రదించారు అని కూడా సమాచారం. ఒకవేళ ఆమె ఈ సినిమా ఓకే చేస్తే పైన చెప్పిన మూడు ప్రశ్నలకు సమాధానాలు వచ్చేస్తాయి అని చెప్పొచ్చు.

ఈ సినిమా ఓకే చేస్తే తెలుగులో పూజ కంటిన్యూ అవుతుంది అని చెప్పొచ్చు. అలాగే కొన్ని కారణాల వల్ల ‘గుంటూరు కారం’, ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ నుండి తప్పుకుంది అని కూడా తేలిపోతుంది. ఆ సినిమాల నుండి తప్పుకోవడానికి ఏదో బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ కారణం కాదు అనే విషయంలోనూ స్పష్టత వచ్చేస్తుంది. కాబట్టి… రవితేజ సినిమా పూజాకు సంబంధించి అనేక విషయాలు చెబుతుంది.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus