ఈ రేంజ్ ప్రమోషన్స్ తెలుగులో మాత్రం ఎందుకు చేయరో!

ఇటీవల “హౌస్ ఫుల్ 4” ప్రమోషన్స్ కోసం హైద్రాబాద్ వచ్చాడు అక్షయ్ కుమార్. సినిమాలోని “శైతాన్ కా సాలా బాలా” అనే పాటను హైద్రాబాద్ మీడియా ముందు విడుదల చేయడమే కాక.. ఆ పాటకు మీడియా మిత్రులతో కలిసి డ్యాన్స్ కూడా చేశాడు. బాలీవుడ్ లో ఈ తరహా ప్రమోషన్స్ అనేవి చాలా కామన్. అయితే.. ఈ ప్రమోషనల్ ఈవెంట్ లో స్టేజ్ వెనక పిచ్చి డ్యాన్సులు వేసిన పూజా హెగ్డే మాత్రం తెలుగు మీడియాను షాక్ కు గురి చేసింది. తెలుగులో ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ వంటి స్టార్ హీరోలందరితోనూ నటిస్తూ ప్రస్తుతం అగ్ర కథానాయిక హోదాను ఎంజాయ్ చేస్తుంది పూజా హెగ్డే.

తాను నటించే తెలుగు సినిమాల ప్రమోషన్స్ కి అటెండ్ అయ్యే పూజాలో ఇంత చురుకుదనం తెలుగు మీడియా ఎన్నడూ చూడలేదు. ఇంటర్వ్యూలు ఇచ్చినా ఏదో సింగిల్ లైన్ ఆన్సర్స్ తో సరిపెట్టేస్తుంది. అలాంటి పూజా హెగ్డే.. బాలీవుడ్ సినిమా అనేసరికి స్టేజ్ మీద డ్యాన్సులు చేయడం చూసిన తెలుగు మీడియా సభ్యులు “ఈ అమ్మాయికి బాలీవుడ్ మీద ఉన్న అభిమానంలో సగం తెలుగు సినిమాల మీద ఉన్నా బాగుండేది” అని పెదవి విరిచారు. సదరు ప్రెస్ మీట్ వీడియోస్ చూసిన ప్రేక్షకులు అదే అనుకొంటున్నారు.

ఎవ్వ‌రికీ చెప్పొద్దు సినిమా రివ్యూ & రేటింగ్!
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus