ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో వరుస ఆఫర్లతో బిజీ అవుతున్నారు. బాలీవుడ్ లో కూడా పూజా హెగ్డే చేతినిండా ఆఫర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఒక్కో సినిమాకు మూడు నుంచి మూడున్నర కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే పూజా హెగ్డే కెరీర్ తొలినాళ్లలో మాత్రం తక్కువ మొత్తం పారితోషికం తీసుకున్నారు.
మూగముడి అనే సినిమా పూజా హెగ్డేకు తొలి సినిమా కాగా ఈ సినిమా కోసం పూజా హెగ్డే రెమ్యునరేషన్ గా కేవలం 30 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఈ సినిమాలో జీవా హీరోగా నటించారు. తొలి పారితోషికంతో పూజా హెగ్డే బీఎండబ్ల్యూ కారును కొన్నారు. ఫస్ట్ రెమ్యునరేషన్ తో కొన్న ఈ కారు అంటే పూజా హెగ్డేకు ఎంతో ఇష్టమని సమాచారం. త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించిన సినిమాలు పూజా హెగ్డేకు నటిగా మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఈ ఏడాది పూజా హెగ్డే నటించిన మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి.
ఈ మూడు సినిమాలపై భారీ అంచనాలు నెలకొనగా ఈ సినిమాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాల్సి ఉంది. మరోవైపు పూజా హెగ్డే కరోనా బారిన పడ్డారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ పూజలు చేస్తున్నారు. ఆచార్య సినిమాలో పూజా హెగ్డే నీలాంబరి పాత్రలో నటిస్తుండగా రాధేశ్యామ్ సినిమాలో ప్రేరణ పాత్రలో నటిస్తున్నారని సమాచారం. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో పూజా హెగ్డే పాత్రకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.