Pooja Kumar, Kamal Haasan: మొత్తానికి పూజా కుమార్ క్లారిటీ ఇచ్చేసింది..!

కమల్ హాసన్ ఎంత గొప్ప నటుడో.. అంతే గొప్ప రొమాంటిక్ కింగ్ అని కూడా చాలా మంది చెబుతుంటారు. ఈయన సినిమాల్లో లిప్ లాక్ లు… అలాగే రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఓ రేంజ్లో ఉంటాయి అంటే ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు సహజీవనం అంటే అందరికీ పరిచయం చేసిందే కమల్ హాసన్ అని కూడా చాలా మంది చెబుతుంటారు. మొదట్లో శృతీ హాసన్ తల్లి మరియు హీరోయిన్ అయిన సారిక తో సహజీవనం చేసాడు కమల్ హాసన్.

ఇద్దరు పిల్లల్ని కూడా కన్నాడు. తరువాత గౌతమితో కూడా సహజీవనం చేసాడు. ఇప్పుడు పూజా కుమార్ అనే ఎన్నారైతో కూడా సహజీవనం చేస్తున్నట్టు గత కొంత కాలం నుండీ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ ఈ వార్తల పై అటు కమల్ కానీ.. ఇటు పూజా కుమార్ కానీ ఎవ్వరూ స్పందించకపోవడంతో ఇది నిజమే అని అంతా ఫిక్స్ అయిపోయారు. వరుసగా కమల్ తో ‘విశ్వరూపం’, ‘ఉత్తమ విలన్’, ‘విశ్వరూపం2’ వంటి చిత్రాల్లో నటించడం….

అందులోనూ పూజా.. కమల్ కుటుంబ సభ్యులు తీసుకున్న ఓ ఫోటో వల్ల కూడా ఈమె ఉండడంతో.. ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ వార్తల పై పూజా కుమార్ క్లారిటీ ఇచ్చింది. ‘కమల్ హాసన్ గారితో నేను ఐదేళ్ళుగా వరుస సినిమల్లో నటిస్తూ వస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులు కూడా నాకు బాగా క్లోజ్ అయ్యారు. అందుకే ఈ వార్తలన్నీ వస్తున్నాయి. మా మధ్య ఎటువంటి ఎఫైర్ లేదు. దయచేసి ఇలాంటి పుకార్లను సృష్టించకండి’ అంటూ పూజా కుమార్ చెప్పుకొచ్చింది.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus