తాజాగా పూనమ్ (Poonam Kaur) మరో పోస్ట్ పెట్టి వార్తల్లో నిలిచింది. త్రివిక్రమ్ ను (Trivikram) ఉద్దేశిస్తూ పెట్టిన ఈ పోస్ట్ సంచనలంగా మారింది. దీని ద్వారా పూనమ్ స్పందిస్తూ.. “త్రివిక్రమ్‌ను వదిలిపెట్టను. అసలు ప్రసక్తే లేదు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి” అంటూ ‘మా అసోసియేషన్’ కి చెందిన నటి ఝాన్సీతో (Jhansi) చేసిన ఆమె చాటింగ్‌ను బయటపెట్టింది. అంతేకాకుండా.. ‘నేను గతంలో కూడా చెప్పాను. ఇప్పుడు మళ్లీ చెబుతున్నాను. త్రివిక్రమ్‌పై నేను మెయిల్ ద్వారా కూడా కంప్లైంట్ చేయడం జరిగింది.
ఝాన్సీతో నేరుగా మాట్లాడాను కూడా.! ‘మీటింగ్ పెడదాం’ అని చెప్పారు. కానీ పెట్టలేదు. తర్వాత ఆలస్యం అయ్యింది అన్నారు. అటు తర్వాత సడన్‌గా ‘మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి’ అన్నారు. తర్వాత మా అసోసియేషన్ నుండి ఎలాంటి ప్రకటన రాలేదు.మహిళా సంఘాలతో మాట్లాడి.. అసలు విషయం తెలుస్తాను’ అంటూ పూనమ్ కౌర్ కామెంట్స్ చేసింది. దీంతో మరోసారి ఆమె పేరు ట్రెండింగ్ లో నిలిచింది అని చెప్పాలి.
పూనమ్ – త్రివిక్రమ్ గొడవ ఈనాటిది కాదు. మొదట ఆమె పవన్ కళ్యాణ్ ను ఎక్కువగా టార్గెట్ చేసి పోస్టులు పెట్టేది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన భర్త అన్నట్టు ఆమె చేసిన కామెంట్లు అభిమానులకి చిర్రెత్తుకొచ్చేలా చేసేవి. వాళ్ళు ఎంత ట్రోల్ చేసినా ఈమె తగ్గలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చాక.. అవి త్రివిక్రమ్ వైపు మళ్ళించింది. పవన్ కు ఈ వివాదంతో సంబంధం లేదు అన్నట్టు కూడా ఆమె స్పందించిన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నప్పుడు.. మా ఇలాంటి వ్యవహారాలను పరిష్కరించేందుకు ఒక కమిటీ వేసినప్పుడు.. పూనమ్ ఎందుకు ఆగుతున్నట్టు? నటి ఝాన్సీ కూడా పూనమ్ ను లెక్కచేయకుండా ఎందుకు ఉన్నట్టు? సో ఈ వ్యవహారం సోషల్ మీడియా వరకు పరిమితమయ్యేలా అయితే కనిపించడం లేదు. ఒకవేళ పూనమ్ కనుక ఇప్పుడు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే.. భవిష్యత్తులో ఆమెను మరో శ్రీరెడ్డిలా జనాలు తీసిపారేస్తారు. ఆమె ఎటువంటి పోస్టులు వంటివి పెట్టినా పట్టించుకోరు.