Poonam Kaur: గుండె ముక్కలైందంటూ షాకింగ్ పోస్ట్ చేసిన పూనమ్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇలాంటి ఒక గొప్ప బిరుదు చిరంజీవికి రావడంతో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా చాలామంది సినీ సెలబ్రిటీలు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మరి అభినందనలు తెలిపారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయనని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ ఫోటోలలో త్రివిక్రమ్ తన లుక్ పూర్తిగా మార్చి వేశారు. ఎప్పుడు గుబురు గడ్డంలో ఉండే ఈయన చిరంజీవిని కలిసిన సమయంలో క్లీన్ షేవ్ లో కనిపించారు. ఇలా చిరంజీవిని కలిసి సరదాగా నవ్వుతూ ఉన్నటువంటి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ఫోటోపై నటి పూనమ్ (Poonam Kaur) స్పందిస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఫోటోను చూస్తే ఎంతో బాధగా ఉందనిపిస్తోందంటూ.. గుండె మొక్కలైందన్నట్టుగా బ్రోకెన్ హార్ట్ సింబల్‌ను షేర్ చేసింది పూనమ్ కౌర్. అసలే త్రివిక్రమ్ మీద పూనమ్ ఎప్పుడూ పరోక్షంగా కౌంటర్లు వేస్తూనే కనిపిస్తుంటుంది. త్రివిక్రమ్ వల్ల తనకు జరిగిన అన్యాయం ఏంటి అనే విషయాన్ని మాత్రం తెలియ చేయకపోయినా ఎప్పటికప్పుడు పరోక్షంగా గురూజీ అంటూనే తనపై సెటైర్స్ వేస్తూ ఉంటారు. ఇక చిరంజీవి త్రివిక్రమ్ ఇద్దరు కలిసి ఫోటో వైరల్ అవ్వడంతో చిరంజీవి కోసం త్రివిక్రమ్ మంచి కథ సిద్ధం చేసి ఉంటారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus