మూడేళ్లుగా నరకం అనుభవిస్తున్నా: పూనమ్

  • February 2, 2024 / 03:10 PM IST

పూనమ్ కౌర్ పరిచయం అవసరం లేని పేరు . ఈమె సినిమాలలో నటిస్తూ సంపాదించుకున్నటువంటి పేరు ప్రఖ్యాతల కంటే సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు చేస్తూ ఎంతో పాపులర్ అయ్యారు ఒకానొక సమయంలో పవన్ కళ్యాణ్ పట్ల ఈమె చేసినటువంటి నెగిటివ్ కామెంట్స్ కూడా సంచలనగా మారాయి. అప్పటినుంచి ఏదో ఒక సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ ఈమె పరోక్షంగా పోస్టులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

గత మూడు సంవత్సరాల నుంచి భయంకరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నానని ఈ వ్యాధి కారణంగా కనీసం బట్టలు కూడా వేసుకోవడానికి తాను ఇబ్బంది పడుతున్నట్లు పూనమ్ వెల్లడించారు. పూనమ్ కౌర్ కి సోకినా వ్యాధి ఫైబ్రోమయాల్జియా. సమంతకి సోకినా మాయోసైటిస్ కి కాస్త దగ్గర లక్షణాలు ఉన్నట్లు ఉన్నాయి. ఈ వ్యాధి బారిన పడిన వారు శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి ముఖ్యంగా ఎమోషనల్ గా ఫీల్ కావడం వల్ల వస్తుందని అంటున్నారు.

కారు ప్రమాదం లాంటి యాక్సిడెంట్స్ వల్ల కూడా ఈ వ్యాధి వస్తుందని తెలుస్తోంది. శరీరం మొత్తం నొప్పులు ఉంటాయి. ఈ వ్యాధి జాయింట్స్ ని, కండరాలని డ్యామేజ్ చేయదు. ఉదయం నిద్ర లేవగానే శరీరం మొత్తం బిగిసిపోయిన ఫీలింగ్ కలుగుతుందని, అలసట, డిప్రెషన్, యాంగ్జైటీ ఉంటాయి. నిద్ర సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా అసందర్భమైన నిద్రకు ఈ వ్యాధి కారణమవుతుందని తెలిపారు.

ఇలా గత మూడు సంవత్సరాలుగా ఈ విధమైనటువంటి బాధ అనుభవిస్తున్నటువంటి ఈమె (Poonam Kaur) గతంలో కేరళలో కూడా ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయితే తాజాగా ఆయుర్వేద నిపుణులు మంతెన సత్యనారాయణని కలిసి కొన్ని సలహాలు సూచనలు కూడా ఈమె తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus