ఈ కరోనా కల్లోలం మొదలైంది చైనాలో అయినప్పటికీ.. ఈ వైరస్ కారణంగా తీవ్రంగా నష్టపోతున్నది మాత్రం ఇటలీ. రోజుకి 500 నుండి 700 మంది ప్రాణాలు కోల్పోతుండగా.. వేల మంది హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. మొన్నటివరకు ఇటలీ అంటే హాలీడే డెస్టీనేషన్ అనుకున్నవాళ్లందరికీ.. అదొక నరకంలా కనిపిస్తోందిప్పుడు. అటువంటి నరకంలో ఇరుక్కుండిపోయింది పాపులర్ సింగర్ శ్వేతాపండిట్. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో పలు సూపర్ హిట్ సాంగ్స్ పాడిన శ్వేతా పండిట్ ప్రస్తుతం ఇటలీలో ఉంది.
“కొత్త బంగారులోకం, పంజా, లీడర్, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, తుఫాన్, సైజ్ జీరో, మహానుభావుడు” వంటి చిత్రాలో పలు సూపర్ హిట్ పాటలు పాడిన శ్వేత పండిట్ గత కొంత కాలంగా ఇటలీలో చిక్కుకుపోయింది. రోజూ ఉదయాన్నే అంబులెన్స్ సౌండ్స్ తోనే నిద్ర లేవాల్సి వస్తుందని, కనీస స్థాయి వసతులు కూడా లేకుండా ప్రాణ భయంతో బ్రతకాల్సి వస్తుందని, ఈ కరోనా మొదలైనప్పట్నుండి కనీసం తన రూమ్ లో నుండి కూడా బయటకు రాలేదని చెబుతున్న శ్వేతా పండిట్.
తన పరిస్థితిని వివరిస్తూ ప్రజలను కూడా జాగ్రత్తగా ఉండమని చెబుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఒకపక్క కనికా కపూర్ లాంటివాళ్ళు తమ వ్యాధిని దాచుకొని అందరికీ అంటిస్తుంటే.. శ్వేతపండిట్ లాంటి వాళ్ళు మాత్రం తమ ద్వారా ఇది ఎవరికైనా సోకే అవకాశం ఉందని.. స్వీయ నిర్భంధంలో ఉండడం అభినందనీయం.
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్