సినిమా పాటలను ఇష్టపడే ప్రేక్షకులకు బల్విందర్ సఫ్రీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పంజాబీ సింగర్ బల్వీందర్ సఫ్రీ గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతూ మృతి చెందారు. గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బల్విందర్ సఫ్రీ బాధ పడుతుండగా 86 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న బల్విందర్ సఫ్రీ చికిత్సకు కోలుకోలేక మృతి చెందారు. బల్విందర్ సఫ్రీ మృతి సంగీత ప్రియులను ఎంతగానో బాధ పెడుతోంది.
కొన్ని నెలల క్రితం బల్విందర్ సఫ్రీ వైద్యుల సూచనల మేరకు ట్రిపుల్ బైపాస్ చేయించుకున్నారు. అయితే సర్జరీ పూర్తైన తర్వాత బల్విందర్ సఫ్రీ కోమాలో ఉండిపోయారు. బల్విందర్ సఫ్రీ కోమాలోకి వెళ్లడానికి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా కారణమని సమాచారం. బల్విందర్ పాడిన పాటలలో మెజారిటీ పాటలు ఛార్ట్ బస్టర్లుగా నిలిచాయి. కొన్ని పాటలను ఆయన పాడినంత అద్భుతంగా మరెవరూ పాడలేరని కామెంట్లు వ్యక్తమయ్యాయి. బల్విందర్ సఫ్రీ పాడిన పాటలను రైతులు సైతం ఎంతగానో ఇష్టపడేవారు.
సినీ, రాజకీయ ప్రముఖులు బల్విందర్ సఫ్రీ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. 63 సంవత్సరాల వయస్సు ఉన్న బల్విందర్ సఫ్రీ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేవారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అభిమానులు ఆయనను ప్రేమగా భాంగ్రీ స్టార్ అని పిలుచుకుంటారు. బల్విందర్ మరణ వార్త తమకు చాలా బాధను కలిగించిందని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
బల్విందర్ సఫ్రీ భౌతికంగా మరణించినా పాటల రూపంలో ఆయన ఎప్పుడూ జీవించే ఉంటారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రముఖ సింగర్లు బల్విందర్ సఫ్రీ మృతికి సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. బల్విందర్ సఫ్రీ పాడిన పాటలలో ఇక్ దిల్ కరే, బోలి బోలి బోలి పాటలు భాషతో సంబంధం లేకుండా సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి.