విశ్వక్ సేన్ హీరోగా ‘పాగల్’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు నరేష్ కుప్పిలి. వాస్తవానికి ‘పాగల్’ థియేటర్లలో ఆడలేదు. కానీ ఓటీటీలో ఆడియన్స్ బాగానే చూశారు. రాంగ్ టైంలో రిలీజ్ అవ్వడం వలన సినిమా ఆడలేదు అని అంతా భావించారు. హీరో విశ్వక్ సేన్ కూడా ఓ ఇంటర్వ్యూలో అలానే చెప్పాడు. సో నరేష్ లో టాలెంట్ ఉందని అంతా అర్ధం చేసుకున్నారు.
ఆ వెంటనే విశ్వక్ సేన్ ‘దాస్ క ధమ్కీ’ అనే సినిమా నిర్మించడానికి రెడీ అయితే… దానికి కూడా దర్శకుడిగా మొదట నరేష్ కుప్పిలినే తీసుకున్నాడు. కానీ తర్వాత ఏమైందో తెలీదు. నరేష్ కుప్పిలిని తప్పించి విశ్వక్ సేన్ డైరెక్ట్ చేశాడు. విశ్వక్ సేన్ నిర్మాత కాబట్టి.. ఆ సినిమా క్రెడిట్స్ నరేష్ కి దక్కలేదు.కొంత గ్యాప్ తర్వాత నరేష్ కి ‘గోట్’ అనే సినిమా చేసే అవకాశం లభించింది.
సుడిగాలి సుధీర్ ఈ సినిమాలో హీరోగా ఎంపికయ్యాడు. దివ్య భారతి హీరోయిన్. ఏడాది క్రితమే రిలీజ్ కావాల్సిన సినిమా ఇది. కానీ మధ్యలో ఆగిపోయినట్టు ప్రచారం జరిగింది. దీంతో ఈ సినిమాని అంతా మర్చిపోయారు. అయితే తాజాగా ఓ ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమాని కంప్లీట్ చేసినట్టు నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించారు. విచిత్రం ఏంటంటే.. ఈ సినిమా నుండి కూడా దర్శకుడు నరేష్ ని తప్పించారు.
ఈ విషయం తెలుసుకుని హీరో సుధీర్ కూడా చిత్ర బృందానికి సహకరించడం మానేసినట్టు టాక్ నడుస్తుంది. నిర్మాత కూడా ఈ విషయంపై ఛాంబర్ కి కంప్లైంట్ చేసినట్టు నేరుగానే తెలిపారు. సుధీర్ సంగతి పక్కన పెడితే.. దర్శకుడు నరేష్ కి ఎందుకు ఇలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి. అప్పుడు ‘ధమ్కీ’ ఇప్పుడు ‘గోట్’ సినిమాల నుండి తప్పించేంతలా ఇతను ఏం చేశాడు? అనే అంశంపై ఇప్పుడు ఇండస్ట్రీలో గట్టిగానే చర్చ జరుగుతుంది.
మరోపక్క సుధీర్, నరేష్ ఒక జట్టుగా ఉండి ‘గోట్’ చిత్ర బృందాన్ని ముఖ్యంగా హీరోయిన్ ను కూడా వేదిస్తున్నట్టు చెప్పి మరో పెద్ద షాకిచ్చారు.