రవితేజ కొత్త సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ విడుదలకు సిద్ధమవుతూ ఇటీవల ప్రచారం షురూ చేసింది. సంక్రాంతికి ఆ సినిమాను రిలీజ్ చేయాలని ప్లానింగ్ భారీగానే సాగుతోంది. గతంలో పొంగల్ ఫైట్‌లో బరిలోకి నిలిచి.. ఆఖర్లో వెనక్కి తగ్గిన రవితేజ ఈసారి ఎలాగైనా ఫైట్‌లో దిగాలని ఫిక్స్ అయ్యాడట. ఆ విషయం పక్కనపెడితే ఆ తర్వాత మాస్ మహారాజ్ చేయాల్సిన సినిమా గురించి గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. అందులో ఒక వార్తను రవితేజ పీఆర్ టీమ్ ఖండించింది. అదే హీరోయిన్ల లెక్క.
రవితేజ తన తర్వాతి సినిమాను ఎమోషనల్ కథు చెప్పే శివ నిర్వాణతో చేయాలని నిర్ణయించుకున్నారు. ఈసారి పూర్తి యాక్షన్ టచ్ ఉన్న ఫ్యామిలీ స్టోరీని రెడీ చేశారని టాక్. ఈ క్రమంలో సినిమాలో ఎక్కువమంది హీరోయిన్లు ఉంటారని వార్తలొస్తున్నాయి. ఇద్దరో, ముగ్గురో కాదు.. ఏకంగా ఆరుగురు హీరోయిన్లను ఈ సినిమాలోకి తీసుకున్నారనేది ఆ పుకార్ల సారాంశం. సినిమా నేపథ్యం బట్టి అంతమంది హీరోయిన్లు అవసరం అని అంటున్నారు. ఇద్దరు స్టార్ హీరోయిన్లు కాగా, మిగిలిన నలుగురు యంగ్ హీరోయిన్లు అని టాక్.

అయితే, ఇదంతా నిజం కాదని రవితేజ పీఆర్ టీమ్ తేల్చేసింది. అలాంటిదేమీ లేదని చెప్పింది. అయితే రవితేజతో సినిమాలో ఎక్కువమంది హీరోయిన్లు ఉండటం కొత్తేమీ కాదు. మొన్నామధ్య చేసిన ‘రావణాసుర’ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు నటించారు. కాబట్టి అలాంటి కథలు ఆయన చేస్తారు. కానీ ఇప్పుడైతే కాదంటున్నారు. కానీ సినిమా మొదలయ్యాక కానీ అసలు విషయం బయటకు రాదు. గతంలో ఇలా నో చెప్పి షూటింగ్ మొదలయ్యాక నిజమైన పుకార్లు ఎన్ని లేవు చెప్పండి.
అలా అని ఈ సినిమాలో ఉంటారని ఎలా చెబుతారు అని అనుకుంటున్నారా? శివ నిర్వాణ ఈ సారి ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్, యాక్షన్ అంటున్నారు. ఆ లెక్కన మల్టిపుల్ హీరోయిన్లు ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి. రవితేజ సినిమాల ప్యాటర్న్ చూసినా ఈ డౌట్ రాకమానదు.
