చిరు గురించి షాకింగ్ నిజాలు చెప్పుకొచ్చిన పోసాని కృష్ణమురళి..!

ఒకప్పుడు స్టార్ రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్న పోసాని కృష్ణమురళి.. ఇప్పుడు విలక్షణ నటుడుగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాల్లోల్లానే నిజ జీవితంలో కూడా పోసాని ఏ విషయాన్నయినా కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తుంటాడు. అలాంటి పోసాని ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. నిజానికి పోసాని కృష్ణమురళిని చిరు ముద్దుగా పి.హెచ్.డి అని పిలుస్తుంటారని అందరూ చెబుతుంటారు. వీరిద్దరి మథ్య మంచి అనుబంధం కూడా ఉంది.

ఇదిలా ఉండగా చిరు గురించి పోసాని మాట్లాడుతూ.. “చిరంజీవిగారు స్థాపించిన ‘ప్రజారాజ్యం’ పార్టీలోకి.. ఆయన నన్ను ఓ మంచి ఉద్దేశ్యంతో ఆహ్వానించారు. నా దగ్గర చిల్లిగవ్వ కూడా ఆశించకుండా టికెట్ ఇచ్చారు. కానీ నేను ఓడిపోయాను. ఆ టైములో చిరంజీవిగారి పై టీడీపీ అధినేత చంద్రబాబు ఇష్టమొచ్చిన విమర్శలు చేశారు.. చేయించారు..! చిరంజీవిగారి చిన్న కుమార్తె శ్రీజ పెళ్లి మేటర్ ను కూడా చంద్రబాబు తన రాజకీయ స్వలాభానికి వాడుకుని.. కొందరు మహిళా నేతలతో చిరంజీవి గారి పై విమర్శలు చేయించారు. అవి చిరంజీవిగారిని చాలా బాధపెట్టాయి.

దాదాపు 2 నెలల పాటు చిరంజీవిగారు మానసికంగా కృంగిపోయారు. అంతేకాదు ఆ రెండు నెలలు ఏడుస్తూనే ఉన్నారు. ఇలా పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అడ్డుపెట్టుకుని చంద్రబాబు ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించారు. అందుకే నా స్టైల్లో చంద్రబాబు పై అలాగే టీడీపీ నేతలపై అప్పట్లో నేను మండిపడ్డాను. చిరంజీవిగారు నిజజీవితంలో చాలా హుందాగా ఉండే వ్యక్తి. పీఆర్పీ టికెట్లు అమ్ముకున్నారని కూడా చిరంజీవి పై విమర్శలు వచ్చాయి. అయితే ఆయనకు అలాంటి రాజకీయాలు…ఆ మాటకొస్తే కపట రాజకీయాల గురించి అస్సలు తెలీదు. ఇది వాస్తవం. చిరంజీవి గారికి తెలీకుండా ఆయన వెనకున్నవారు ఏదో తప్పు చేశారు.అందుకే ఆయనకీ బ్యాడ్ నేమ్ వచ్చింది. ఎన్టీఆర్ గారికి అలాగే చిరంజీవి గారికి…వీరిద్దరికీ కూడా ప్రజలు మాత్రమే తెలుసు. రాజకీయాలు తెలీవు” అంటూ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus