Posani, Pawan Kalyan: పవన్ అది నిరూపిస్తే నన్ను చెంపదెబ్బ కొట్టండి: పోసాని

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణమురళి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘రిపబ్లిక్’ సినిమా ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై పోసాని స్పందించారు. సోమవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన పోసాని.. పవన్ రెమ్యునరేషన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకి రూ.50 కోట్లు తీసుకుంటారని ఆరోపించారు. ఈ క్రమంలో ‘పవన్ నీ రెమ్యునరేషన్ 10 కోట్లా..? 50 కోట్లా..? అని ప్రశ్నించారు.

‘పవన్ సినిమాకి పది కోట్లు మాత్రమే తీసుకుంటున్నట్లు చెబుతున్నాడు.. అదే నేను ఒక్కో సినిమాకి రూ.15 కోట్లు చొప్పున ఇస్తాను 4 సినిమాలకు సంతకం చేస్తాడా..?’ అని ప్రశ్నించారు. ఆయన చేసే సినిమాలోని హీరోయిన్ ను, లొకేషన్, పారితోషికం, తక తానే స్వయంగా సెలెక్ట్ చేసుకుంటాడని చెప్పారు. తన సినిమాలకు రూ.50 కోట్లు తీసుకోవడం లేదని పవన్ నిరూపిస్తే.. నన్ను చెంపదెబ్బ కొట్టండి అంటూ పోసాని వ్యాఖ్యానించారు. అలానే పవన్ కళ్యాణ్ సినిమా అంటే టికెట్ కి రూ.500, 1000 వసూళ్లు చేయడమంటే ఏంటని..

అది మధ్య తరగతి, సామాన్యులను హింసించడమే కదా అని అన్నారు. హీరోలంటే ఎన్టీఆర్, ఏఎన్నార్ లని.. వారు ఏనాడు డిస్ట్రిబ్యూషన్ విషయంలో, డబ్బు విషయంలో వేలు పెట్టేవారు కాదన్నారు. వారు నిజజీవితంలో రియల్ హీరోలను అన్నారు. మెగాస్టార్ చిరంజీవి సంస్కారవంతుడని.. ఆయనను చూసి పవన్ కళ్యాణ్ నేర్చుకోవాలని అన్నారు.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus