సెప్టెంబర్ నెల మొదటి వారాన్ని టార్గెట్ చేసి చాలా పలు చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ప్రమోషనల్ కంటెంట్ ప్రామిసింగ్ గా అనిపించింది ‘జనక అయితే గనక’ ’35.. చిన్న కథ కాదు’ (35-Chinna Katha Kaadu) సినిమాలే అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఊహించని విధంగా ‘జనక అయితే గనక’ (Janaka Aithe Ganaka) వెనక్కి వెళ్ళింది. విజయ్ (Thalapathy Vijay) ‘ది గోట్’ (The Greatest of All Time) పై మొదటి నుండి అంచనాలు లేవు. సో ఈ వీకెండ్ కి ఏకైక ఛాయిస్ గా ’35 – చిన్న కథ కాదు’ నిలిచింది.
35 Chinna Katha Kaadu
నివేదా థామస్ (Nivetha Thomas) , ప్రియదర్శి (Priyadarshi),, భాగ్యరాజా, గౌతమి (Gauthami) వంటి స్టార్స్ నటించిన ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్స్ ఆల్రెడీ కొన్ని చోట్ల పడ్డాయి. వాటికి మంచి టాక్ లభించింది. అయితే ఈ సినిమా కమర్షియల్ గా సేఫ్ అవ్వుద్దా లేదా అనేది అందరిలో నెలకొన్న మిలియన్ డాలర్ల ప్రశ్న. ’35 – చిన్న కథ కాదు’ (35 Chinna Katha Kaadu) సినిమాకి రూ.6.5 కోట్ల బడ్జెట్ అయ్యిందట. ఓటీటీ రైట్స్ రూపంలో ఆల్రెడీ రూ.7.5 కోట్లు వచ్చేశాయట.
నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా (35 Chinna Katha Kaadu) డిజిటల్ రైట్స్ ను దక్కించుకుంది. సో టేబుల్ ప్రాఫిట్స్ తో ఈ సినిమా రిలీజ్ అవుతున్నట్టే. సినిమాకి ఎలాగు మంచి టాక్ వస్తుంది.. శాటిలైట్ బిజినెస్ కి కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఎలాగూ సినిమాని ‘సురేష్ ప్రొడక్షన్స్’ సంస్థ ఓన్ గా రిలీజ్ చేస్తుంది కాబట్టి… ఓ మాదిరి వసూళ్లు వచ్చినా ఇబ్బంది ఉండదు. ఒకవేళ బాక్సాఫీస్ వద్ద నిలబడితే.. మేకర్స్ కి మరిన్ని లాభాలు వచ్చినట్టే..!