ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన ఛత్రపతి మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. నిర్మాత బీ.వీ.ఎస్.ఎన్ ప్రసాద్ కు ఈ సినిమా మంచి లాభాలను అందించింది. ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా అదే టైటిల్ తో రీమేక్ కాగా వీవీ వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
ఈ సినిమా (Chatrapathi) హిందీ టీజర్ ను థియేటర్లలో ప్రదర్శించగా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఛత్రపతి పాత్రకు బెల్లంకొండ శ్రీనివాస్ తన వంతు న్యాయం చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే బెల్లంకొండ శ్రీనివాస్, వీవీ వినాయక్ బాలీవుడ్ లో బిజీ కావడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాతృకతో పోల్చి చూస్తే రీమేక్ లో స్వల్పంగా మార్పులు చేశారని తెలుస్తోంది. ఈ ఏడాదే మే 12వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.
బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లో తొలి సినిమాతోనే సత్తా చాటుతారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. పెన్ స్టూడియోస్ నిర్మాతలు ఈ సినిమా కోసం ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడలేదని తెలుస్తోంది. హిందీలో సైతం ఈ సినిమా మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బెలంకొండ శ్రీనివాస్ డబ్బింగ్ సినిమాల ద్వారా హిందీ ప్రేక్షకులకు సుపరిచితం కాగా జయజానకి నాయక సినిమా హిందీ వెర్షన్ వ్యూస్ విషయంలో సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే.
బెల్లంకొండ శ్రీనివాస్ కు తెలుగులో పెద్దగా హిట్లు లేకపోయినా బాలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. లక్ కలిసొస్తే బెల్లంకొండ శ్రీనివాస్ కు తిరుగుండదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?