‘అసురన్’ రీమేక్ కు వెంకీ న్యాయం చేస్తాడట..!

విక్టరీ వెంకటేష్ ఇప్పుడు ఫుల్ ఫామ్లో ఉన్నాడు. గతేడాది ‘ఎఫ్2’ ‘వెంకీ మామ’ చిత్రాలతో సూపర్ హిట్లు అందుకున్నాడు. ఈ ఏడాది తమిళ సూపర్ హిట్ ‘అసురన్’ రీమేక్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘నారప్ప’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టిన మొదట్లో.. వెంకటేష్ హీరో అనగానే ఫుల్ నెగిటివిటీ ఉండేది. అందులోనూ ప్లాపుల్లో ఉన్న శ్రీకాంత అడ్డాల దర్శకుడు అని అనౌన్స్ చేసిన వెంటనే ఈ నెగిటివిటీ ఇంకా పెరిగింది. దీని పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఎప్పుడైతే.. ‘నారప్ప’ గా వెంకీ ఫస్ట్ లుక్ రిలీజ్ చెయ్యగానే ఆ నెగిటివిటీ చాలా వరకూ తగ్గిందనే చెప్పాలి.

ఇక వెంకటేష్ రీమేక్ చేస్తున్నాడు అంటే మినిమం గ్యారెంటీ అనే నమ్మకం అందరిలోనూ ఉంది. గతంలో వెంకీ రీమేక్ చేసిన ‘చంటి’ ‘సుందరాకాండ’ ‘రాజా’ ‘వసంతం’ ‘దృశ్యం’ ‘గురు’ వంటి హిట్ చిత్రాలు చేసాడు. కాబట్టి ‘నారప్ప’ చిత్రం కూడా హిట్ అవుతుందనే అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల పూర్తిచేసుకున్న ఓ లాంగ్ షెడ్యూల్ చాలా బాగా వచ్చిందట. వెంకీ నటన చాలా బాగా చేసాడని చిత్ర యూనిట్ వర్గాల నుండీ సమాచారం. మరి వారి మాటల్లో ఎంతవరకూ నిజముంది అనే విషయం తెలియాల్సి ఉంది.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus