Devil Movie: ‘డెవిల్’ .. హీరోయిన్ సంయుక్త పోస్టర్లో దీనిని గమనించారా..!

‘బింబిసార’ తో కళ్యాణ్ రామ్ రేంజ్ పెరిగింది. ఇప్పటివరకు కళ్యాణ్ రామ్ కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్ మూవీగా ‘బింబిసార’ నిలిచింది. అయితే కళ్యాణ్ రామ్ తర్వాతి సినిమా అయిన ‘డెవిల్’ కి దానికి మించి బడ్జెట్ పెడుతున్నారు.అభిషేక్ నామా ఈ చిత్రానికి నిర్మాత. ‘బాబు బాగా బిజీ’ అనే సినిమా తీసిన నవీన్ మేడారం ఈ చిత్రానికి దర్శకుడు అని మొదట ప్రకటించారు. గ్లింప్స్ కూడా రిలీజ్ అయ్యింది. దానికి సూపర్ రెస్పాన్స్ లభించింది.

ఈ సినిమాకు సంబంధించిన మొదటి పోస్టర్లో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్ గా నవీన్ పేరు పడింది. కానీ అటు తర్వాత ఈ సినిమాకు కథా రచయితగా శ్రీకాంత్ విస్సా, డైరెక్టర్ గా నవీన్ మేడారం.. ల పేర్లు పడ్డాయి. మొత్తంగా డైరెక్టర్ గా నవీన్ పేరు అయితే పడింది. కానీ ఇప్పుడు డైరెక్టర్ గా కూడా నవీన్ పేరు కనిపించలేదు. నిన్న హీరోయిన్ సంయుక్త మీనన్ పుట్టినరోజు సందర్భంగా (Devil Movie) ‘డెవిల్’ టీం ఓ పోస్టర్ ను విడుదల చేసింది.

దీనిని కరెక్ట్ గా గమనిస్తే…. డైరెక్టర్ ప్లేస్ లో నవీన్ పేరు లేదు. ‘అభిషేక్ పిక్చర్స్ ఫిల్మ్’ అని ఉంది. దీంతో ‘డెవిల్’ చిత్రం నుండి దర్శకుడు నవీన్ మేడారం..ని తొలగించినట్టు అంతా అనుకుంటున్నారు. ఈ విషయంపై ఇంకా క్లారిటీ అయితే రాలేదు. కానీ మొదటి నుండి పోస్టర్స్ తీరుని గమనిస్తే.. అది నిజమే అనిపిస్తుంది.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus