ఈ సారి సంక్రాంతి చిత్రాల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. టాలీవుడ్ నుండి విడుదలైన రెండు పెద్ద చిత్రాలు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. చిత్ర విడుదలకు ముందు నుండే వీరిద్దరి మధ్య కొంత యుద్ధ వాతావరణం నెలకొంది. విడుదల తేదీలు థియేటర్ల సర్ధుబాటు విషయంలో భేదాలు వచ్చాయి. ఇండస్ట్రీ పెద్దలు రెండు చిత్రాల నిర్మాతల మధ్య సంధి కుదిర్చారు. అప్పుడు మొదలైన గొడవలను చిత్రాల విడుదల తరువాత కొనసాగిస్తున్నారు. దీని కోసం పోస్టర్స్ వార్ మొదలుపెట్టారు. మహేష్ మొదటగా ప్రతి సంక్రాంతికి బ్లాక్ బస్టర్స్ వస్తాయి… ఈసారి బ్లాక్ బస్టర్ కి బాబు వచ్చాడు అని ఒక పోస్టర్ విడుదల చేశారు. దీనితో అల వైకుంఠపురంలో టీం ఏకంగా ఫలితం పూర్తిగా రాకముందే సంక్రాంతి విన్నర్ అని పోస్టర్ విడుదల చేసి, మేము తగ్గేది లేదు అన్నట్లుగా వైరి వర్గానికి సూచనలు పంపారు.
ఇక కలెక్షన్స్ పోస్టర్స్ విషయంలో కూడా ఒకరికి మించి ఒకరు కలెక్షన్స్ లెక్కలు, రికార్డ్స్ తో పోస్టర్స్ విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో అసలు వసూళ్లకు, పోస్టర్స్ పై వేస్తున్న వసూళ్లకు పొంతన ఉండటం లేదని డిస్ట్రిబ్యూటర్స్ వాపోతున్నారు. ఇలాంటి వాతావరణం గతంలో కూడా ఉన్నప్పటికీ ఈ సారి హద్దులు దాటినట్టు అనిపిస్తుంది. సినిమాలో కూడా కొన్ని డైలాగ్స్ ఒకరిని ఉద్దేశించి మరొకరు రాసుకున్నట్లుగా ఉంది. ఇక ఎలాగైనా చిత్ర వసూళ్లు తగ్గకూడదనే ఉద్దేశంతో చిత్ర యూనిట్ మొత్తం టీవీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ విధంగా అల వైకుంఠపురంలో మరియు సరిలేరు నీకెవ్వరు చిత్రాల మధ్య వార్ తారా స్థాయికి చేరింది. పరిశ్రమలో పోటీ తత్త్వం మంచిదే కానీ అది క్వాలిటీ చిత్రాల చిత్రీకరణలో ఉంటే బాగుంటుంది. అంతే కాని ఇలా… ఫేక్ కలెక్షన్స్, రెచ్చగొట్టే డైలాగ్స్, పోస్టర్స్ విషయంలో కాదు.
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!