పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు, జల్సా సినిమాలు తెలుగు రాష్ట్రాలలో రీరిలీజ్ కాగా ఈ సినిమాలు అంచనాలకు మించి కలెక్షన్లను సొంతం చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ క్రేజ్, రేంజ్ వేరు అని ఆయన గురించి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జల్సా సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్లు ప్రేక్షకులతో కిక్కిరిసిపోతున్నాయి. పవన్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ అభిమానులు సైతం థియేటర్లలో సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన సినిమాల గురించి ప్రమోషన్స్ చేయడానికి కూడా పెద్దగా ఇష్టపడరనే సంగతి తెలిసిందే.
సంవత్సరం సంవత్సరానికి పవన్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోందే తప్ప ఏ మాత్రం తగ్గడం లేదనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ బాల్యంలో ఆస్తమాతో బాధ పడేవారు. ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఆస్తమా వల్ల ఇంట్లో ఎక్కువగా అల్లరి చేసేవాడిని కాదని పవన్ తెలిపారు. నాకు పెద్దగా ఫ్రెండ్స్ కూడా ఉండేవారు కాదని ఆయన చెప్పుకొచ్చారు. కొంతమంది ఫ్రెండ్స్ తో ముచ్చట్లు పెడదామని అనుకున్నా నా ఆలోచనలకు వారి అభిప్రాయాలకు పొంతన కుదిరేది కాదని పవన్ తెలిపారు.
కెరీర్ పరంగా అయోమయంలో ఉన్న సమయంలో అన్నీ వదిలేసి సినిమాలలో ప్రయత్నించాలని అన్నయ్య చెప్పారని పవన్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత సత్యానంద్ గారి దగ్గరకు శిక్షణకు వెళ్లానని పవన్ అన్నారు. సత్యానంద్ గారికి నటన సంగతి తర్వాత అని మొదట నాలో బిడియాన్ని పోగొట్టడం అవసరమని ఆయనకు అర్థమైందని పవన్ చెప్పుకొచ్చారు. ఆ సమయంలోనే నేను సిగ్గు, మొహమాటాల గోడలు బద్ధలు కొట్టానని పవన్ కామెంట్లు చేశారు.
ఆ తర్వాత నా బ్రతుకు నేను బ్రతకగలననే ధైర్యం వచ్చిందని అదే నాలో నేను చూసిన గొప్ప మార్పు అని పవన్ వెల్లడించారు. పవన్ వెల్లడించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.