Pawan Kalyan: మెగాస్టార్ కు అవార్డుపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఇదే!

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కీలక విషయాల గురించి స్పందిస్తున్నారు. దేవర సినిమాకు భారీ స్థాయిలో టికెట్ రేట్ల పెంపుతో పాటు ఎక్కువ సంఖ్యలో షోలు ప్రదర్శించడానికి పవన్ కళ్యాణ్ వల్లే అనుమతులు సాధ్యమయ్యాయి. చిరంజీవికి (Chiranjeevi)  వచ్చిన అవార్డ్ గురించి సైతం తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. 156 సినిమాలలో 537 పాటలు, 27 వేల డ్యాన్స్ స్టెప్స్ తో అలరించడంతో చిరంజీవి పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో నమోదైన సంగతి తెలిసిందే.

Pawan Kalyan

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు, బాలీవుడ్‌ హీరో ఆమిర్‌ఖాన్‌ (Aamir Khan) ఈ అవార్డును చిరంజీవికి ప్రధానం చేయడం జరిగింది. చిరంజీవికి అవార్డ్ రావడం గురించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. గిన్నిస్ రికార్డుల్లో అన్నయ్య చిరంజీవి పేరు లిఖితం కావడం సంతోషదాయకం అని పవన్ అన్నారు. సినిమా ఇండస్ట్రీలో రికార్డులు, విజయాలు చిరంజీవికి కొత్త కాదని అయితే చిరంజీవి సాధించిన ఈ రికార్డ్ మాత్రం ఒకింత ప్రత్యేకం అని పవన్ పేర్కొన్నారు.

చిరంజీవిని ద మోస్ట్‌ ప్రొలిఫిక్‌ ఫిల్మ్‌ స్టార్‌ ఇన్‌ ఇండియన్‌ సినిమా అని గౌరవించడం ప్రతి ఒక్కరికీ ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని పవన్ చెప్పుకొచ్చారు. అన్నయ్యకు హృదయపూర్వక అభినందనలు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మరోవైపు చిరంజీవి సాధించిన అరుదైన ఘనత గురించి సినీ, రాజకీయ ప్రముఖులు చిరంజీవికి అభినందనలు తెలుపుతుండటం గమనార్హం.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, దర్శకుడు రాజమౌళి (S. S. Rajamouli) , మరి కొందరు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేయడం గమనార్హం. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర (Vishwambhara) సినిమాతో బిజీగా ఉన్నారు.

హాట్ టాపిక్ అయిన మహేష్ బాబు గడ్డం ఫోటోలు, వీడియోలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus