NTR30: జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమాలో విలన్ క్యారెక్టర్ కోసం ఇద్దరు స్టార్ హీరోలు.. ఎవరంటే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న కొత్త సినిమా అప్‌డేట్ స్వయంగా ఎన్టీఆర్ తన నోటితో చెప్పే వరకు శాంతించలేదు ఫ్యాన్స్.. కొద్ది రోజులుగా NTR 30 షూటింగ్ ఎప్పుడో చెప్పాలంటూ గోల గోల చేసిన అభిమానులు.. ‘అమిగోస్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మరింత హంగామా చేయడం.. యాంకర్ సుమ, తారక్ చేతికి మైక్ ఇచ్చేముందే అప్‌డేట్ గురించి అడగడంతో కాస్త సీరియస్ అయ్యాడు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలున్నాయి.

పైగా ‘ఆచార్య’ దెబ్బతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. పైగా పాన్ ఇండియా సినిమా.. ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో పాన్ ఇండియానే కాదు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు తారక్. తన పర్ఫార్మెన్స్‌కి అందరూ ఫిదా అయ్యారు. కొరటాలతో చేస్తున్న సినిమా హీరోగా ఎన్టీఆర్‌కి 30వ సినిమా.. ఈ నెలలో పూజా కార్యక్రమం నిర్వహించి.. వచ్చే నెల నుంచి షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఇక ఈ చిత్రాన్ని 2024 ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తున్నట్లు ఎన్టీఆర్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

ఇప్పుడీ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. అదేంటంటే.. తారక్ – కొరటాల ఫిలింలో తమిళ స్టార్, ‘చియాన్’ విక్రమ్ విలన్‌గా నటించనున్నారట. విక్రమ్ ‘విలన్’, ‘ఇంకొక్కడు’ లాంటి సినిమాల్లో ప్రతినాయకుడిగానూ మెప్పించిన సంగతి తెలిసిందే. దీంతో కథ, క్యారెక్టర్‌ని బట్టి NTR 30లో విలన్‌గా విక్రమ్ అయితే బాగుంటుందనుకుంటున్నారని సమాచారం.

అలాగే ‘ఆదిపురుష్’ లో విలన్‌‌గా కనిపించనున్న బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ పేరును కూడా పరిశీలిస్తున్నారని అంటున్నారు. ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్ బ్యానర్ మీద కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ తరపున నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పిస్తున్నాడు. శ్రీకర్ ప్రసాద్, సాబు సిరిల్, రత్నవేలు, అనిరుధ్ తదితరులు ఇప్పటికే కన్ఫమ్ అయ్యారు..

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus