Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?
- September 29, 2026 / 04:47 PM ISTByPhani Kumar
సినిమా ప్రమోషన్స్ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఒకప్పుడు గోడల మీద పోస్టర్లు వేయడం, టీవీల్లో చిన్నపాటి ప్రోమోలు వదలడం వరకే పబ్లిసిటీ పరిమితంగా ఉండేది. చిన్న సినిమాలకి అయితే టాక్ బాగుంటే జనాలు థియేటర్లకు క్యూ కట్టేవారు.ఆ తర్వాత నెమ్మదిగా ట్రెండ్ మారింది. ఆడియో రిలీజ్ ఫంక్షన్లు కాస్తా ప్రీ-రిలీజ్ ఈవెంట్లుగా మారాయి. ట్రైలర్లతో పాటు టీజర్లు, ఆ టీజర్ల కంటే ముందు గ్లింప్స్ వదలడం ఆనవాయితీగా మారిపోయింది.
Thella Kaagitham

ఇన్ని ప్రయోగాలు చేసినా జనాలు థియేటర్లకు వస్తారన్న గ్యారెంటీ లేని పరిస్థితి ఏర్పడింది. సరిగ్గా ఇలాంటి టైమ్‌లో సినిమా చుట్టూ ఏదైనా వివాదం (కాంట్రవర్సీ) జరిగితే.. ఆటోమెటిక్‌గా ఆడియన్స్ దృష్టి దానిపై పడుతోంది. ఆ కాంట్రవర్సీల వల్ల బాక్సాఫీస్ దగ్గర భారీగా క్యాష్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.దీంతో మేకర్స్ ఆలోచనా విధానం కూడా మారిపోయింది. వాళ్లకు వాళ్లే కావాలని ఏదో ఒక వివాదాన్ని సృష్టించి, సోషల్ మీడియాలో తమ సినిమాకు ఫ్రీగా పబ్లిసిటీ తెచ్చుకునే స్థాయికి వచ్చేశారు.
తాజాగా ‘తెల్ల కాగితం'(Thella Kaagitham) సినిమా యూనిట్ కూడా సరిగ్గా ఇదే పంథాలో అడుగులు వేశారేమో అనిపిస్తోంది. విషయంలోకి వెళితే.. అక్టోబర్ 2న ‘తెల్ల కాగితం’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సాయి ధరమ్ తేజ్, దిల్ రాజు, హరీష్ శంకర్ లాంటి టాలీవుడ్ ప్రముఖులు ఈ సినిమాను ప్రమోట్ చేశారు. ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. కానీ, అదే రోజున ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’, ‘సిగ్మా’ లాంటి పెద్ద సినిమాలు కూడా రిలీజ్ అవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొంది.
ఆ పెద్ద సినిమాల హడావుడిలో ‘తెల్ల కాగితం’ పై ఆడియన్స్ ఫోకస్ పడే అవకాశాలు కాస్త తక్కువే. సరిగ్గా ఇలాంటి టైమ్లో ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా నుంచి ఒక ఇంటిమేట్ సీన్ లీక్ అవ్వడం ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో కొద్ది గంటల్లోనే ఈ సినిమాపై యూత్‌లో విపరీతమైన క్యూరియాసిటీ పెరిగిపోయింది. అయితే, ఇక్కడే ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. నెట్టింట లీకైన ఆ సన్నివేశం అసలు సినిమాలోనే ఉండదని కొందరు సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
వాళ్లు చెప్పిందే గనుక నిజమైతే, సినిమాపై బజ్ పెంచడం కోసం చిత్ర బృందమే కావాలని ఈ సీన్‌ను లీక్ చేసిందన్న వాదనలకు బలం చేకూరుతోంది. మరోపక్క ఈ లీకైన వీడియో వ్యవహారంపై మూవీ యూనిట్ పోలీసులకు ఫిర్యాదు చేయడం, ‘వీడియోను షేర్ చేస్తే కఠిన చర్యలు తప్పవు’ అంటూ సోషల్ మీడియాలో నోట్ వదలడం కూడా ఆ పబ్లిసిటీ వ్యూహంలో భాగమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైతేనేం ‘తెల్లకాగితం’కి రావాల్సిన అటెన్షన్ అయితే వచ్చేసింది.
‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే
https://www.youtube.com/watch?v=P2W3eju6aN4














