25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే
- September 29, 2026 / 01:23 PM ISTByPhani Kumar
‘నీ కోసం’ తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీను వైట్ల.. ఆ తర్వాత నాగార్జునతో ఓ సినిమా చేయాలని అనుకున్నారు. కానీ నాగార్జున నీకోసం సినిమా చూసి.. ‘రామ్ గోపాల్ వర్మ స్టైల్లోనే ఉంది ఆ సినిమా… నీకంటూ సెపరేట్ స్టైల్ ఉన్నట్టు కనిపించలేదు. చాలా సీరియస్ గా తీశావ్’ అంటూ తన అభిప్రాయాన్ని చెప్పారట. దీంతో స్టైల్ మార్చి ఆకాష్, రేఖ..లను హీరోయిన్లుగా పెట్టి ‘ఆనందం'(Anandam) అనే యూత్ఫుల్ కామిడీ మూవీ చేశారు శ్రీను వైట్ల.
25 Years For Anandam
వెంకట్, తనూరాయ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ‘ఉషాకిరణ్ మూవీస్’ బ్యానర్ పై దివంగత స్టార్ ప్రొడ్యూసర్ రామోజీరావు ఈ చిత్రాన్ని చాలా లో-బడ్జెట్లో నిర్మించారు. తనికెళ్ళ భరణి, రామోజీరావు, చంద్రమోహన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్.నారాయణ వంటి స్టార్స్ అంతా ఈ సినిమాలో నటించారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకి మంచి పబ్లిసిటీని తెచ్చిపెట్టింది. 2001 సెప్టెంబర్ 28న పెద్దగా హైప్ లేకుండానే రిలీజ్ అయ్యింది ఈ సినిమా.

మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో కామిడీకి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ సెప్టెంబర్ 28కి ‘ఆనందం’ రిలీజ్ అయ్యి 25 ఏళ్ళు పూర్తికావస్తోంది. ఈ సందర్భంగా క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
| నైజాం | 2.46 cr |
| సీడెడ్ | 1.06 cr |
| ఉత్తరాంధ్ర | 1.26 cr |
| ఈస్ట్ | 0.75 cr |
| వెస్ట్ | 0.59 cr |
| గుంటూరు | 0.90 cr |
| కృష్ణా | 0.92 cr |
| నెల్లూరు | 0.48 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 8.42 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ | 1.63 cr |
| వరల్డ్ వైడ్ (టోటల్) | 10.05 cr |
‘ఆనందం’ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.2 కోట్లు. ఎవ్వరూ ఊహించని విధంగా ఫుల్ రన్లో ఈ సినిమా ఏకంగా రూ.10.05 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తంగా బయ్యర్లకు రూ.8.05 కోట్ల ప్రాఫిట్స్ ను అందించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.













