Prabhaas, Maruthi: ఆ తప్పు జరగకపోతే మారుతి రేంజ్ మారిపోతుందిగా?

ప్రభాస్ మారుతి కాంబోలో మూవీ అభిమానులకు ఏ మాత్రం ఇష్టం లేదు. వరుస ఫ్లాపులతో ఢీలా పడిన మారుతి ప్రభాస్ తో భారీ బడ్జెట్ సినిమాను హ్యాండిల్ చేయలేరని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ప్రభాస్ మాత్రం మారుతికి మాట ఇవ్వడంతో ఈ ప్రాజెక్ట్ విషయంలో వెనక్కు తగ్గలేదు. రాజా డీలక్స్ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. తాజాగా అన్ స్టాపబుల్ సీజన్2 షూట్ లో పాల్గొన్న ప్రభాస్ షూట్ పూర్తైన వెంటనే మారుతి సినిమా షూట్ లో పాల్గొన్నారు.

వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ నెలలో మారుతి సినిమా కోసం వారం రోజుల డేట్లు కేటాయించారని సమాచారం అందుతోంది. మారుతి సినిమాతో ప్రభాస్ త్యాగానికి తగ్గ ఫలితం దక్కుతుందా? లేదా? అనే కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ప్రభాస్ సినిమాతో సక్సెస్ సాధిస్తే మారుతి రేంజ్ కూడా మారిపోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. గతంలో ప్రభాస్ ఎంతోమంది టాలెంటెడ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వగా కొంతమంది డైరెక్టర్లు ప్రభాస్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటే

మరి కొందరు మాత్రం ప్రభాస్ నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు. పక్కా కమర్షియల్ సినిమా నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్ ఫ్యాన్స్ మారుతిని నమ్మకపోయినా ప్రభాస్ మాత్రం మారుతిని నమ్ముతున్నారు. వరుసగా భారీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్న ప్రభాస్ ఆ సినిమాలు తన రేంజ్ ను మారుస్తాయని నమ్ముతున్నారు.

పాన్ ఇండియా హీరోగా ఇప్పటికే ప్రభాస్ కు గుర్తింపు ఉండగా టాలీవుడ్ స్టార్ హీరోలలో చాలామంది హీరోలు ప్రభాస్ కు స్నేహితులు కావడం గమనార్హం. రాబోయే రోజుల్లో ప్రభాస్ మల్టీస్టారర్స్ లో కూడా నటిస్తారేమో చూడాల్సి ఉంది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus