Prabhas: ‘రాధే శ్యామ్’ లో పూజా హెగ్డే తో కిస్సింగ్స్ సీన్స్ పై స్పందించిన ప్రభాస్..!

  • March 4, 2022 / 09:26 PM IST

మరో వారం రోజుల్లో ప్రభాస్ ‘రాధే శ్యామ్’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1970 లలోని ఇటలీ నేపథ్యంలోని ప్రేమ కథగా తెరకెక్కింది. ‘గోపికృష్ణా మూవీస్’ సంస్థతో కలిసి ‘యూవీ క్రియేషన్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదట ఈ చిత్రం పై జనాలకి అంచనాలు లేవు. ఫుల్ లెంగ్త్ లవ్ స్టోరీ కదా.. ఏముంటుందిలే అన్నట్టు అనుకున్నారు.

కానీ టీజర్, ట్రైలర్, పాటలు వంటివి సినిమా పై అంచనాలు క్రియేట్ చేసాయి. హస్తసాముద్రిక నిపుణుడి పాత్రలో సరికొత్త హీరోయిజాన్ని చూపించబోతున్నాడు ప్రభాస్. పూజా హేగ్దే కూడా ప్రభాస్ కు తగ్గ పెయిర్ అన్నట్టు ఉంది. ఇప్పటి వరకు అనుష్క మాత్రమే ప్రభాస్ కు కరెక్ట్ జోడి అని అంతా అనుకున్నారు. కానీ పూజా హెగ్డే కూడా ప్రభాస్ పక్కన కరెక్ట్ గా సరిపోయింది. వీళ్ళ రొమాన్స్ కూడా సినిమాలో ఓ రేంజ్లో పండిందని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతుంది.

వీరి మధ్య కిస్సింగ్ సీన్లు కూడా ఎక్కువగానే ఉన్నట్టు వినికిడి. ఇక పూజా హెగ్డేతో ముద్దు సీన్ల పై తాజాగా ప్రభాస్ స్పందించాడు. ‘యాక్షన్ సినిమాలు మాస్ సినిమాల్లో అయితే ముద్దు సీన్లు అవైడ్ చేసే అవాకాశాలు ఉంటాయి. కానీ ఇది పూర్తిగా ప్రేమకథా చిత్రం. దీని విషయంలో డైరెక్టర్ కు రిక్వస్ట్ పెట్టినా.. జెన్యూన్ ఔట్పుట్ రాదు. అందుకోసమే ఈ మూవీ విషయంలో తప్పలేదు. నిజానికి హీరోయిన్లతో ముద్దు సీన్లు అంటే వాళ్లకు ఎలా ఉంటుందో తెలీదు కానీ నాకైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది.

షర్ట్ లేకుండా హీరోయిన్ తో రొమాంటిక్ సన్నివేశాల్లో పాల్గొనడం అదీ క్యాస్ట్ అండ్ క్రూ మధ్య చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇన్ని సినిమాల్లో నటించినా కో స్టార్స్ తో రొమాన్స్ చేసే సమయంలో సిగ్గు పడుతుంటాను. నేను ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు అవుతున్నా.. నాకు సిగ్గు అనేది పోలేదు. మాట్లాడటం కూడా నాకు ఎప్పటికప్పుడు కొత్తే’ అంటూ చెప్పుకొచ్చాడు ప్రభాస్.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus