Prabhas: ‘రాజా డీలక్స్’ ప్రాజెక్టు వెనుక అంత కథ ఉందా..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు చేతినిండా… భారీ-బడ్జెట్ మరియు పాన్-ఇండియా చిత్రాలతో బిజీగా గడుపుతున్నాడు. ‘రాధే శ్యామ్’ రిలీజ్ కు రెడీ గా ఉంది.’సలార్’, ‘ఆదిపురుష్’ కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయాయి.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయాల్సిన ‘ప్రాజెక్ట్ K’ చిత్రీకరణ దశలో ఉండగా…సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయాల్సిన ‘స్పిరిట్’ మూవీ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. వీటితో పాటు ఈ మధ్యనే మరో ప్రాజెక్టు కు కూడా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అదే ‘రాజా డీలక్స్’. మారుతీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ.. వెనుక పనులన్నీ చక చకా జరిగిపోతున్నట్టు ఇన్సైడ్ టాక్. తమన్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. ఇది ఒక హారర్ కామెడీ చిత్రం.ప్ర‌భాస్ కామెడీ చేసిన మూవీస్ పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ప్రభాస్ కు కామెడీ చేయడం అంటే చాలా ఇష్టం. ఆ బలహీనతే.. దర్శకుడు మారుతీకి ప్లస్ అయిపోయి ఉండొచ్చు.

ఒకసారి సెట్స్ పైకి వెళ్తే.. 50 రోజుల్లో ఈ ప్రాజెక్టు పూర్తయిపోతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులకి ఓ నెలరోజులు వేసుకున్నా ఇది 3 నెలల్లోపే కంప్లీట్ అయిపోయే ప్రాజెక్టు ఇది. అయితే ఈ ‘రాజా డీలక్స్’ కు మొదటి ఛాయిస్ ప్రభాస్ కాదట. చిరు కోసం ఈ కథని సిద్ధం చేసాడట మారుతీ. చిరు.. ఈ సినిమా చేయడానికి రెడీ అయ్యారు. కానీ చివరి నిమిషంలో డ్రాప్ అయ్యారు.తర్వాత బన్నీకి కూడా ఈ కథ వినిపించాడు మారుతీ.

అయితే ‘పుష్ప’ మేకోవర్లో ఉన్న బన్నీ ఈ పాత్ర చేయడానికి రెడీగా లేడని తెలుస్తుంది. అందుకే ప్రభాస్ సీన్లోకి ఎంటర్ ఇచ్చినట్టు సమాచారం.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus