‘బాహుబలి’ తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.. అది రాజమౌళి చలవే అని కొట్టిపారేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ‘బాహుబలి’ విషయంలో ప్రభాస్ కృషి ఎంతో ఉందనేది వాస్తవం. ఒప్పుకుని తీరాలి కూడా..! ఎందుకంటే 5 ఏళ్ళ పాటు.. ఈ సినిమాకి పనిచేసాడు. ఒళ్ళు హూనం చేసుకుని కష్టపడ్డాడు.రెండు సార్లు సర్జరీలు చేయించుకున్నాడు. అంత కష్టపడ్డాడు కాబట్టే.. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. అయితే అది కూడా నిజం కాదు..
ఏకంగా ‘పాన్ వరల్డ్ స్టార్’ గా ఎదిగాడని చెప్పాలి. 30 ఏళ్లుగా ఏ ఇండియన్ స్టార్ హీరో వల్ల కూడా కానిది ప్రభాస్ సాధించి చరిత్ర సృష్టించాడు. విషయం ఏమిటంటే.. ‘రష్యన్ ఆడియన్స్ హార్ట్’ అనే అవార్డును ప్రభాస్ సొంతం చేసుకున్నాడు. ‘బాహుబలి’ (సిరీస్) తో రష్యన్ ప్రేక్షకులను ప్రభాస్ అమితంగా ఆకట్టుకోవడంతో ఈ అవార్డు ప్రభాస్ కు దక్కినట్టు తెలుస్తుంది. సరిగ్గా 30 ఏళ్ల క్రితం.. రాజ్ కపూర్ నటించిన ‘శ్రీ 420’.. ‘అవారా’… ‘ఆరాధన’ వంటి చిత్రాలు రష్యన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
అందుకే రాజ్ కపూర్ కు ‘రష్యన్ ఆడియన్స్ హార్ట్’ అవార్డు లభించింది. మళ్ళీ ఇంతకాలానికి ప్రభాస్ కు మాత్రమే ఆ అవార్డు దక్కిందని తెలుస్తుంది. ‘బాహుబలి’ చిత్రం ఈ మధ్యనే రష్యాలో విడుదలయ్యి సూపర్ హిట్ గా నిలిచింది. ప్రభాస్ నటనకు రష్యను ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ చిత్రంతో ప్రభాస్ ఇమేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. దీంతో ప్రభాస్ తరువాతి సినిమాలకు కూడా అక్కడ డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుందేమో..!
Most Recommended Video
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!