“వంద చిత్రాలు చేసినా రాని పేరు ఒక బాహుబలి చిత్రం ద్వారా వచ్చింది”.. ఓ ఇంటర్వ్యూ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చెప్పిన మాటలివి. అవును.. అందులో వంద శాతం నిజముంది. బాహుబలి తో ఇండియన్ స్టార్ గా డార్లింగ్ ఎదిగారు. బాహుబలి కంక్లూజన్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. మేడం టుస్సాడ్ మ్యూజియం వారు బ్యాంకాక్ లో అమరేంద్ర బాహుబలి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ మ్యూజియంలో స్థానం దక్కించుకున్న తొలి తెలుగు నటుడు ప్రభాస్ కావడం విశేషం. ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని ప్రభాస్ దక్కించుకున్నారు.
ప్రముఖ మ్యాగజైన్ జిక్యూ దేశంలోని అన్ని రంగాల నుండి అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాను ప్రకటించింది. అందులో ఉత్తరాదికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. దక్షిణాది (సినీ రంగం) నుంచి ప్రభాస్ ఒక్కడే ఎన్నిక కావడం విశేషం. ఈ గౌరవం ప్రభాస్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రస్తుతం ఆయన సుజీత్ డైరక్షన్లో ‘సాహో’ చేస్తున్నారు. 150 కోట్ల బడ్జెట్ తో వంశీ ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.