‘బాహుబలి2’ తర్వాత సుమారు రెండేళ్ళ గ్యాప్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘సాహో’. నిన్న (ఆగష్టు 30న) విడుదలైన ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. ‘సినిమా పెద్ద డిజాస్టర్’ అంటూ కామెంట్లు కూడా వచ్చాయి. కానీ ఆ టాక్ .. సినిమా కలెక్షన్ల పై ఏమాత్రం ప్రభావం చూపించలేదని తెలుస్తుంది. ప్రభాస్ తన బాక్సాఫీస్ స్టామినా ఏంటనేది మరోసారి రుచి చూపించాడు. ఇప్పటికే ‘బాహుబలి2’ చిత్రంతో మొదటి రోజు 100 కోట్లు పైనే కలెక్షన్లు రాబట్టిన రికార్డు ప్రభాస్ అకౌంట్ లో ఉంది. ఇప్పుడు తో మరోసారి ఆ ఫీట్ ను సాధించాడు. మొదటి రోజు ‘సాహో’ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా 125కోట్లకు పైగా గ్రాస్ రావడం ట్రేడ్ పండితులకు సైతం షాకిచ్చే అంశం.
కేవలం హిందీలోనే ఈ చిత్రం 24.40కోట్ల వసూల్ చేయడం విశేషం. అక్కడ 2019 సంవత్సరంలో హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన మూడో చిత్రంగా ‘సాహో’ అక్కడ రికార్డు సృష్టించింది. ఈ లిస్ట్ లో సల్మాన్ ‘భారత్’ 42.30 కోట్లు వసూల్ చేసి మొదటి స్థానంలో ఉండగా… అక్షయ్ కుమార్ ‘మిషన్ మంగళ్’ చిత్రం 29.61 కోట్లు వసూల్ చేసి రెండో స్థానంలో నిలిచింది. అయితే అవి హాలిడే రోజున విడుదలయ్యాయి. కానీ ‘సాహో’ నాన్ హాలిడే రోజు విడుదలై .. అది కూడా నెగిటివ్ టాక్ తో 24.40 కోట్లు వసూల్ చేయడం.. అందులోనూ ఈరోజు ఇంకా స్క్రీన్ లు పెంచడం… నిజంగా తెలుగు సినిమా గర్వించదగ్గ విషయం అనే చెప్పాలి. ‘సినిమాకి ప్లాప్ టాక్ వస్తే మాత్రం ఏంటి.. ప్రభాస్ ఉన్నాడుగా.. అది చాలు’ అంటూ ప్రేక్షకులు ఈ చిత్రం చూడడానికి ఎగపడుతున్నారు. ఇక వరుసగా రెండు సార్లు మొదటిరోజు 100 కోట్ల గ్రాస్ ను రాబట్టిన సినిమాలు ప్రభాస్ పేరుతో ఉండడం ఓ రికార్డు అనే చెప్పాలి.