Adipurush: ఆది పురుష్ సినిమాపై నెగిటివ్ రూమర్స్… క్లారిటీ ఇచ్చిన టీమ్!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం ఆది పురుష్.ఈ సినిమా జూన్ 16వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ఏకంగా ఐదు భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.. ఇలా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. అదేవిధంగా ఈ సినిమా గురించి మరో వైపు నెగిటివ్ వార్తలు కూడా భారీగా ప్రచారం అవుతున్నాయి. ఈ సినిమా విడుదల చేసే ప్రతి థియేటర్ లోనూ ఒక సీటు హనుమంతుడి కోసం ఖాళీగా ఉంచాలని చిత్ర బృందం వెల్లడించిన సంగతి మనకు తెలిసిందే.

ఎక్కడైతే రామాయణం పారాయణం చేయబడుతుందో అక్కడ హనుమంతుడు తప్పకుండా వస్తారు అన్నది మన హిందువుల నమ్మకం. అందుకే ఒక సీటును ఖాళీగా ఉంచాలని చిత్ర బృందం కోరారు. ఇక ఈ వ్యాఖ్యలపై కొందరు తీవ్ర స్థాయిలో నెగిటివ్ కామెంట్లను వైరల్ చేస్తున్నారు.చిత్ర బృందం ఇలా ప్రకటించింది భక్తితో కాదని కేవలం డబ్బు కోసం మాత్రమే ఇలా ప్రకటించారంటూ వార్తలు సృష్టించారు.

ఇలా హనుమంతుడి కోసం ఒక సీటు కేటాయించారని చెప్పడంతో ఆ సీటు పక్కన కూర్చోవడానికి చాలామంది ఇష్టపడతారు అలాంటి సమయంలో ఆ సీటు టికెట్లను భారీ ధరలకు అమ్మబోతున్నారంటూ వార్తలు సృష్టించారు. ఇలా ఈ విషయం గురించి పెద్ద ఎత్తున వార్తలు వైరల్ కావడంతో ఈ వార్తలపై చిత్ర బృందం స్పందించారు.

ఈ సందర్భంగా (Adipurush) ఆది పురుష్ టీమ్ స్పందించి ఈ సినిమా గురించి వస్తున్నటువంటి వార్తలలో ఏ మాత్రం నిజం లేదని హనుమంతుడి కోసం వదిలేసిన సీటు పక్కన సీట్లకు ధరలు పెంచలేదని అన్ని ధరలు ఒకేలా ఉన్నాయి అంటూ టి సిరీస్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ వార్తలను కొట్టి పారేశారు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus