Adipurush: బజ్ లేదన్నారు.. గట్టిగానే ప్లాన్ చేస్తున్నారుగా.!

ప్రభాస్ నటిస్తున్న వరుస పాన్ ఇండియా సినిమాల్లో ‘ఆదిపురుష్’ కూడా ఒకటి. బాలీవుడ్లో ‘తానాజీ’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకుడు. టి.సిరీస్ సంస్థ ఈ చిత్రాన్ని రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. జూన్ 16 న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన గ్లిమ్ప్స్ కు మిశ్రమ స్పందన లభించింది. వి.ఎఫ్.ఎక్స్ చాలా నాసిరకంగా ఓ కార్టూన్ సినిమాని తలపించేలా ఉందని నెటిజన్లు ట్రోల్ చేశారు.

అయినప్పటికీ దేశవ్యాప్తంగా ‘ఆదిపురుష్’ ట్రైలర్ ట్రెండ్ అయ్యింది. యూట్యూబ్ లో 100 మిలియన్లకు పైగా వ్యూస్ ను కొల్లగొట్టి రికార్డులు సృష్టించింది. అయితే ప్రభాస్ అభిమానులకు మాత్రం ‘ఆదిపురుష్’ పై నమ్మకం లేనట్టే కనిపిస్తుంది. ‘సలార్’ ‘ప్రాజెక్ట్ కె’ ల పై ఉన్న నమ్మకం ‘ఆదిపురుష్’ పై లేనట్టు సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ పై కూడా సెటైర్లు రావడం వాళ్లకు అస్సలు నచ్చలేదు అనే చెప్పాలి.

ఏది ఏమైనా (Adipurush) ‘ఆదిపురుష్’ విడుదల టైం దగ్గర పడుతుంది. కాబట్టి ట్రైలర్ ను విడుదల చేసే టైం రానే వచ్చింది. మే 9 న సాయంత్రం 5 : 30 నిమిషాలకు థియేటర్లలో అలాగే యూట్యూబ్ వేదికగా ‘ఆదిపురుష్’ ట్రైలర్ విడుదల కానుంది. ఏకంగా 105 థియేటర్లలో ‘ఆదిపురుష్’ ట్రైలర్ విడుదల కాబోతుందని తెలుస్తుంది.

ఇది మామూలు విషయం అయితే కాదు. సినిమా సంగతి ఎలా ఉన్నా.. ప్రభాస్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని ‘ఆదిపురుష్’ ప్రమోషన్లను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus