కోట్లలో పెట్టుబడి పెడుతోన్న స్టార్ హీరో!

‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఎంతగా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉత్తరాదిన కూడా ప్రభాస్ కి మార్కెట్ ఏర్పడింది. ‘సాహో’ సినిమాకి ప్లాప్ టాక్ వచ్చినప్పటికీ బాలీవుడ్ లో ఈ సినిమా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇది చూసే బాలీవుడ్ దర్శకనిర్మాతలు ప్రభాస్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అతడి ప్రతీ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతోంది. ‘ఆదిపురుష్’ సినిమాతో అతడు నేరుగా హిందీలో ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా రూపకర్తలు కూడా బాలీవుడ్ వాళ్లే. ఈ సినిమా షూటింగ్ కోసం ప్రభాస్ కొన్ని నెలల పాటు ముంబైలోనే ఉండాల్సి వస్తుంది. ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ లు కూడా ముంబైలో చిత్రీకరించే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రభాస్ తరచూ ముంబైకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ముంబైలో ఓ భారీ ఇల్లు కొనుక్కోవాలని చూస్తున్నాడట ప్రభాస్. ‘ఆదిపురుష్’ నిర్మాతల్లో ఒకరైన భూషణ్ కుమార్ తో ఈ విషయంపై సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ కి మంచి ఇల్లు చూసి పెట్టే బాధ్యత భూషణ్ కుమార్ తీసుకున్నారట.

ఈ ఇంటిపై ఇన్వెస్ట్ చేయడం ఓ పెట్టుబడిలా ఉంటుందనే ఉద్దేశంతో ప్రభాస్ ఖరీదైన ఇల్లు కొనాలని చూస్తున్నారు. దీనిపై పదుల కోట్ల మొత్తంలో పెట్టుబడి పెట్టబోతున్నాడట. మొత్తానికి మన స్టార్లు హైదరాబాద్ తో పాటు ముంబైలో కూడా ఇల్లు కొనడం మొదలుపెట్టేశారు. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాను పూర్తి చేస్తున్నాడు. జూలై 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే ‘సలార్’ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ‘ఆదిపురుష్’ సినిమా వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల కానుంది.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus