Prabhas, Kriti: అవన్నీ అవాస్తవాలే ప్రభాస్ ఎంగేజ్మెంట్ పై క్లారిటీ!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. ఈశ్వర్ సినిమా ద్వారా ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన ప్రభాస్ తన మొదటి సినిమాతోనే హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత ప్రభాస్ నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వటంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో నటించిన బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా పాపులర్ అయ్యాడు.

ఆ సినిమాలలో హీరోయిన్ అనుష్కతో కలిసి నటించడం వల్ల వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. ఇప్పటికీ ప్రభాస్ పెళ్లి గురించి ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. అయితే ప్రభాస్ మాత్రం ఇప్పటికీ తన పెళ్లి గురించి క్లారిటీ ఇవ్వటం లేదు. తాజాగా ప్రభాస్ పెళ్లి గురించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా షూటింగ్ పనులలో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ ప్రభాస్ కి జంటగా నటిస్తోంది. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక గత రెండు రోజులుగా వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలు ఇలా వైరల్ అవటానికి కారణం బాలీవుడ్ సినీ క్రిటిక్ ఉమైర్‌ సంధు. తాజాగా ” ప్రభాస్ – కృతి సనన్ కి వచ్చే వారం ఎంగేజ్మెంట్ జరగబోతోంది. వీరి ఎంగేజ్మెంట్ మాల్దీవ్స్ లో జరగనుందని పోస్ట్ పెట్టాడు. దీంతో ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో ఒక్కసారిగా వైరల్‌గా మారింది. ఈ వార్త తెలిసిన ప్రభాస్ అభిమానులు ఒక్కసారిగా అయోమయంలో పడ్డారు.

ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో అని తెలుసుకునే పనిలో ఉన్నారు. అయితే తాజాగా ఈ వార్తలపై ప్రభాస్ టీం స్పందిస్తూ… ప్రభాస్ ఎంగేజ్మెంట్ గురించి వస్తున్న వార్తలలో నిజం లేదని వారిద్దరూ కేవలం స్నేహితులని స్పష్టం చేశారు. మరొకవైపు కృతి సనన్ టీం కూడా ఈ వార్తలను కొట్టి పారేసింది. ఏది ఏమైనా ప్రభాస్ పెళ్లి వార్తలు ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus